News January 27, 2025

ఖమ్మం: తెలంగాణ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వైష్ణవి రత్న

image

పినపాక జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వైష్ణవి రత్న జాతీయస్థాయి అండర్ 17 క్రికెట్ పోటీలకు ఎంపికైంది. హైదరాబాద్‌లోని ఓ అకాడమీలో ఆమె శిక్షణ పొందుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా కెప్టెన్‌గా ఉన్న వైష్ణవి ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో ప్రథమ స్థానం పొందింది. తెలంగాణ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైనట్లు స్కూల్ గేమ్ ఫెడరేషన్ సెక్రటరీ నరసింహమూర్తి ప్రకటించారు.

Similar News

News December 5, 2025

రణస్థలం: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జేసీ

image

రణస్థలం మండలం పైడిభీమవరం మెగా పీటీఎం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని అన్నారు. అనంతరం వల్లభరావుపేట, సంచాం, కొండములగాం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. స్థానిక రైతులతో మాట్లాడి ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారానే మిల్లర్లకు ధాన్యం అందించాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఏఓ పాల్గొన్నారు.

News December 5, 2025

7న తిరుపతి జిల్లాలో NMMS పరీక్ష

image

తిరుపతి జిల్లాలో ఈనెల 7న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్(NMMS) పోటీ పరీక్ష జరగనుంది. గూడూరులో 3, పుత్తూరులో 2, శ్రీకాళహస్తిలో 3, సూళ్లూరుపేటలో 2, తిరుచానూరులో 2, తిరుపతిలో 2 మొత్తం 14 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో 2,958 మంది పరీక్షకు హాజరవుతారని డీఈవో కుమార్ తెలిపారు. అర గంట ముందే ఎగ్జాం సెంటర్లకు వెళ్లాలని సూచించారు.

News December 5, 2025

‘విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలి’

image

విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్ పిలుపునిచ్చారు. కేంద్రీయ విద్యాలయం వార్షిక ఆటల పోటీలు 2025-26 కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ హాజరయ్యారు. ఆమెకు స్కౌట్స్ అండ్ గైడ్స్ స్వాగతం పలికింది. ఆటల పోటీల జెండాను ఆవిష్కరించి ప్రోగ్రాంను ప్రారంభించారు. విద్యార్థుల నృత్యాలు, ప్రదర్శనలు అలరించాయి.