News December 15, 2024
ఖమ్మం: దుబాయ్ పారిపోయిన వ్యక్తి అరెస్ట్

మైనర్ బాలికను వేధించిన ఖమ్మం(D) పోలేపల్లికి చెందిన యలమల్ల సతీష్ని LBనగర్ పోలీసులు అరెస్టు చేశారు. మన్సూరాబాద్లో అక్క, బావ వద్ద ఉంటూ అదే కాలనీలో మైనర్ బాలికను వెంటపడుతూ, ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి వేధించేవాడు. రాత్రుల్లో ఆమెని పిలుస్తూ ఇబ్బంది పెట్టేవాడు. అక్టోబర్లో కేసు నమోదవగా నిందితుడు దుబాయ్ పారిపోయాడు. వారం క్రితం వచ్చిన అతన్ని విచారించి రిమాండ్కు పంపామని సీఐ వినోద్ కుమార్ తెలిపారు.
Similar News
News December 5, 2025
బెల్టు షాపులపై దాడులు.. రూ.35 వేల మద్యం సీజ్

ఖమ్మం: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు మండలాల్లోని బెల్టు షాపులపై టాస్క్ఫోర్స్ బృందాలు దాడులు నిర్వహించినట్లు ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. కొణిజర్ల, రఘునాథపాలెం, చింతకాని సహా 7 మండలాల్లో దాడులు నిర్వహించి, సుమారు రూ.35 వేల విలువ గల దాదాపు 600 లీటర్లు ఐఎంఎఫ్ఎల్ మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News December 5, 2025
కూసుమంచిలో అత్యధిక జీపీలు, వార్డులు

ఖమ్మం జిల్లాలో అత్యధిక జీపీలు, వార్డులు కూసుమంచి మండలంలో ఉన్నాయి. మండలంలో 41 జీపీలకు గాను 364 వార్డులు ఉన్నాయి. ఆ తర్వాత సింగరేణి మండలంలో 41 జీపీలు, 356 వార్డులు, తిరుమలాయపాలెం మండలంలో 40 జీపీలు 356 వార్డులు ఉన్నాయి. కూసుమంచి మండలంలో మొత్తం 50,357 మంది ఓటర్లకు గాను 24,321 మంది పురుషులు, 26,035 మంది మహిళలు ఇతరులు ఒకరు ఓటరుగా నమోదయ్యాయి.
News December 5, 2025
ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో గర్భిణులకు తప్పని ప్రైవేటు బాట

ఖమ్మం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రూ.30 లక్షల విలువైన టిఫా స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. దాదాపు ఏడదిన్నరగా రేడియాలజిస్ట్ లేకపోవడంతో ఈ కీలక సేవలు అందడం లేదు. శిశువు ఎదుగుదల తెలుసుకోవాల్సిన గర్భిణులు చేసేది లేక రూ.4,000 వరకు చెల్లించి ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. పూర్తిస్థాయి రేడియాలజిస్ట్ను నియమించాలని గర్భిణులు కోరుతున్నారు.


