News February 27, 2026

ఖమ్మం: నిర్వాసితుల గోడు.. పైరవీకారుల జోరు!

image

వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యవహారంలో కొందరు బయటి వ్యక్తులు ‘సందట్లో సడేమియా’లా చొరబడుతున్నారు. నిర్వాసితులకు ఇళ్లు నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో.. కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో 652 కుటుంబాల వడపోత సాగుతోంది. అయితే, అధికార పార్టీ నేతల అండతో అనర్హులను జాబితాలో చేరుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి, అసలైన బాధితులకు న్యాయం చేయాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు.

Similar News

News April 18, 2026

ఈ ఆహారంలో పుష్కలంగా విటమిన్ B12

image

విటమిన్ B12 <<19680368>>లోపాన్ని<<>> నివారించేందుకు పోషకాహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మాంసం, చేపలు, గుడ్లు, పాలు, పెరుగులో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ‘శాకాహారులు ఫోర్టిఫైడ్ ధాన్యాలు, సోయా పాలు తీసుకోవడం ఉత్తమం. నరాల బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవాలి. లోపం తీవ్రంగా ఉంటే వైద్యుల సలహాతో సప్లిమెంట్లు వాడండి’ అని వివరిస్తున్నారు.

News April 18, 2026

ఉమ్మడి KNR జిల్లాలో కొనసాగుతున్న ఎండ తీవ్రత

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా గోదూరు 44.2℃తో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. అల్లీపూర్లో 44.1℃గా నమోదైంది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి-ధర్మారంలో 44.1, వీణవంక 43.8℃, పెద్దపల్లి జిల్లా రామగుండం 44, ఆకెనపల్లి 43.9℃, రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లి 43.5, పెద్దలింగాపురంలో 43.4℃ ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News April 18, 2026

ఉపాధి హామీ పథకాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ నాగరాణి

image

పోడూరు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను జిల్లా కలెక్టర్ నాగరాణి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భ గుర్రపుడెక్కతో సహజ ఎరువు తయారు చేసే మిషన్‌ను ఆమె ప్రారంభించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉపాధి హామీ పథకం బలమైన ఆధారమని, ప్రతి కార్మికుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో దాసిరాజు, అధికారులు పాల్గొన్నారు.