News April 13, 2025
ఖమ్మం: నేడు వనజీవి రామయ్య అంత్యక్రియలు

పద్మశ్రీ వనజీవి రామయ్య అంత్యక్రియలు ఆదివారం అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలోని శ్మశానవాటికలో జరగనున్నాయి. అంతిమయాత్రకు జిల్లాలోని మంత్రులు, అధికారులతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యావరణ ప్రేమికులు పెద్దఎత్తున తరలిరానున్నారు.
Similar News
News September 16, 2025
నిజామాబాద్: ఈ నెల 17 నుంచి పోషణ మాసం

పిల్లల పెరుగుదలకు, పోషణ లోపం తగ్గించుట, బరువు లోపం లేకుండా పోషక ఆహారాలను అందించుటలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కలెక్టర్ సమావేశం నిర్వహించారు. పోషణ మాసం కార్యక్రమాల అమలు తీరును సమీక్షించి, అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.
News September 16, 2025
రానున్న 2-3 గంటల్లో వర్షం.. భారీగా ఈదురు గాలులు

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షం పడే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, కరీంనగర్, మెదక్, నిర్మల్, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షం కురవొచ్చని అంచనా వేసింది. గంటకు 41-61కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
News September 16, 2025
నిజామాబాద్: విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలి: సీపీ

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగిన ఇంజినీర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటితరం ఇంజినీర్లు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముందుగా విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఇంజినీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.