News September 2, 2024

ఖమ్మం: నేడు విద్యాసంస్థలకు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం ఖమ్మం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్య విద్యాసంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Similar News

News September 19, 2024

కనుల పండువగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో గురువారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ చేశారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

News September 19, 2024

ఖమ్మం: వేర్వేరు కారణాలతో ముగ్గురి సూసైడ్

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా.. ఖమ్మంలో ఇంటర్ చదువుతున్న యువతి మనస్తాపం చెంది సూసైడ్ చేసుకోగా.. కూసుమంచి మండలం జుజ్జువరావుపేటకు చెందిన యువతి ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగింది. కాగా, ఆదిత్య టౌన్‌షిప్‌కి చెందిన వెంకటరాజా(61) కుటుంబ సభ్యులు మందలించడంతో బుధవారం ఇంట్లో ఉరేసుకున్నాడు.

News September 19, 2024

నేడు పాలేరు పాతకాలువకు నీరు విడుదల

image

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో కూసుమంచి మండలం పాలేరులోని పాత కాలువ గండీ పనులను ఇరిగేషన్ అధికారులు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేశారు. ఈ రోజు మధ్యాహ్నం పాత కాలువకు ఐబీ ఆఫీసర్లు నీటిని విడుదల చేయనున్నారు. ఖరీఫ్ సీజన్లో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో నీటిని విడుదల చేయనున్నారు. పాలేరు పాతకాలువ పరివాహకంలో 60 వేల ఎకరాల వరిసాగు ఉంది.