News August 3, 2024
ఖమ్మం: పంచాయతీ ఎన్నికల సందడి షురూ!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో 1,070 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు ఐదుగురి చొప్పున మాస్టర్ ట్రైనర్లుగా ఆపరేటర్ల జాబితా తయారు చేసి పంచాయతీ అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. వీరు శిక్షణ పొందిన అనంతరం పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బందికి ఓటరు జాబితాపై అవగాహన కల్పిస్తారు.
Similar News
News September 17, 2024
కొత్తగూడెం: గోదావరి వద్ద గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పవిత్ర గోదావరిలో నిర్వహిస్తున్న వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వాహనంపై నుంచి విగ్రహం కిందకి దింపుతుండగా విగ్రహం జారీ కింద పడింది. ఈ ఘటనలో స్విమ్మర్ రాజేశ్‌కు గాయాలయ్యాయి. అధికారులు వెంటనే స్పందించి అంబులెన్సులో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
News September 17, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
> ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవం వేడుకలు
> ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా గణేశుని నిమజ్జనాలు
> నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం
> నేడు సత్తుపల్లి మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే
> నేడు అశ్వారావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే పర్యటన
> నేడు కారేపల్లిలో పర్యటించనున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్
> భద్రాద్రి రామయ్య, పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
News September 17, 2024
గత ప్రభుత్వం ఇచ్చింది 49 వేలు కార్డులు మాత్రమే: పొంగులేటి
ఖమ్మం: గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది కేవలం 49 వేల రేషన్ కార్డులు మాత్రమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను మంజూరు చేస్తుందని చెప్పారు. దాదాపు 90 లక్షల కార్డులు ఇప్పుడు ఉన్నాయని, వాటిని బైఫరికేషన్ చేసి, స్మార్ట్ కార్డులు ఇస్తామని, ప్రతీ పేదవాడికి కార్డులు అందించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.