News April 2, 2025

ఖమ్మం: పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

image

అర్హులైన యువత రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి‌.శ్రీజ తెలిపారు. మంగళవారం మధిర మండలం దెందుకూరు గ్రామంలో రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి‌.శ్రీజ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత దరఖాస్తు దారులతో అదనపు కలెక్టర్ ఇంటరాక్ట్ అయ్యారు.

Similar News

News December 5, 2025

మూడో విడత.. నిన్న ఎన్ని నామినేషన్లు వచ్చాయంటే.!

image

ఖమ్మం జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో రోజు గురువారం 7 మండలాల్లో కలిపి సర్పంచ్‌కు 288, అటు వార్డులకు 1173 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బుధ, గురువారాల్లో కలిపి ఏన్కూరు, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, సింగరేణి, తల్లాడ, వేంసూరు మండలాల్లో 191 సర్పంచ్ స్థానాలకు గాను 378, 1742 వార్డులకు గాను 1410 నామినేషన్లు వచ్చాయి.

News December 5, 2025

ఖమ్మం: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చింతకాని మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నేరడకు చెందిన కంచం డేవిడ్(20) తన ఇంట్లో కరెంటు మీటర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. డేవిడ్ మృతితో వారి కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News December 5, 2025

చంద్రుగొండలో రేషన్ బియ్యం పట్టివేత

image

చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా 280 క్వింటాళ్ల రేషన్ బియ్యం (విలువ రూ.5.60 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ అరుణ్‌కుమార్, రాజ్‌బార్ విచారణలో బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఛత్తీస్‌గఢ్‌కు అధిక ధరలకు తరలిస్తున్నట్లు ఒప్పుకొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.