News March 20, 2025
ఖమ్మం: పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్

మంచి మనస్సుతో అధికారులు నాణ్యతతో పనులు పూర్తి చేసి బాలల సదనం సుందరీకరణ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్, నగరంలోని బాల సదనం భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాల సదనంలో చేపట్టాల్సిన మరమ్మత్తు పనులు, పిల్లలకు ఆహ్లాదం కోసం కల్పించాల్సిన ఆట పరికరాలు, గ్రీనరీ, వాల్ పెయింట్, అదనపు వసతుల ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News April 25, 2025
ఖమ్మం: వరకట్నం కోసం ఒప్పంద పత్రం డిమాండ్.. ఆగిన పెళ్లి

వరకట్నం ఇచ్చే విషయమై ఒప్పంద పత్రం రాస్తేనే పెళ్లి జరుగుతుందని వరుడు తెగేసి చెప్పడంతో పీటలపైన పెళ్లి ఆగిపోయిన ఘటన కూసుమంచిలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన యువతీయువకుడు ఇష్టపడ్డారు. ఇరువర్గాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో వరుడు నగదు, ఎకరా భూమి ఎప్పుడు ఇస్తారో ఒప్పంద పత్రం రాసి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పెళ్లి నిలిచిపోయింది.
News April 25, 2025
పెనుబల్లి: వడదెబ్బకు గురై మరో వ్యక్తి మృతి

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వారం వ్యవధిలో ఆరుగురు మృతిచెందగా.. ఇవాళ ఒకరు చనిపోయారు. పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెంకు చెందిన వడ్రంగి నెల్లూరి బోధనాచారి అలియాస్ చంటి (37) వడదెబ్బకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News April 25, 2025
కారేపల్లి: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కారేపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. దుబ్బతండాకు చెందిన లావుడ్యా భద్రు(52) రెండు ఎకరాలలో మిర్చి, రెండు ఎకరాలలో పత్తి సాగు చేశాడు. పంట సరిగ్గా పండగ పోవడంతో చేసిన అప్పులు తీరవని బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.