News September 24, 2024
ఖమ్మం: పిడుగుపాటుతో ఇద్దరు యువతుల మృతి
దమ్మపేట మండలం జగ్గారం గ్రామంలో మంగళవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. కాగా గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు యువతులు సున్నం అనూష (23), కట్టం నాగశ్రీ (23) మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మరో మహిళ మడకం సీతమ్మ పరిస్థితి విషమంగా ఉందన్నారు. జగ్గారంలో కౌలు వ్యవసాయం చేస్తున్న రవిరాజు చేల్లో పనులకు వెళ్ళిన కూలీల సమీపంలో పిడుగు పడిందన్నారు. సీతమ్మను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Similar News
News October 9, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
∆} పలు శాఖల అధికారులతో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
News October 9, 2024
కొత్తగూడెం: ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు టీచర్లుగా ఎంపిక
కరకగూడెం మండల పరిధిలోని తాటిగూడెం గ్రామ పంచాయతీ విప్పచెట్టు గుంపునకు చెందిన రామటెంకి హనుమంతరావు, జిమ్మిడి రాధ, జిమ్మిడి లీల ప్రవీణ టీచర్లుగా ఎంపికయ్యారు. చిన్న గ్రామం నుంచి ముగ్గురు టీచర్లుగా ఎంపికవడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చొప్పలలో తోలేం మౌనిక ఎస్.జి.టి టీచర్‌గా ఎంపికయ్యారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
News October 9, 2024
గతంలో మధ్యాహ్న భోజన నిధులు కూడా ఇవ్వలేదు: డిప్యూటీ సీఎం భట్టి
ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. పెండింగ్ లో ఉన్న కాస్మోటిక్, స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేసినట్లు భట్టి పేర్కొన్నారు. గత ప్రభుత్వం అన్ని బిల్లులను పెండింగ్లోనే పెట్టిందన్నారు. కనీసం మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా నిధులు విడుదల చేయలేదన్నారు. ఇక నుంచి ఏ నెల బిల్లు ఆనెలలోనే విడుదల అవుతాయని డిప్యూటీ సీఎం ఖమ్మంలో స్పష్టం చేశారు.