News May 23, 2024
ఖమ్మం: పెళ్లికి నిరాకరించిన వ్యక్తిపై కేసు నమోదు

ప్రేమించి పెళ్లికి నిరాకరించిన వ్యక్తిపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. ఖమ్మం రూరల్ మండలంలో ఓ గ్రామానికి చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన సంజయ్ అనే యువకుడు ప్రేమ పేరుతో శారీరకంగా లోబర్చుకున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి కొద్ది రోజుల క్రితం నిలదీయగా, అతను నిరాకరించాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రామారావు తెలిపారు.
Similar News
News December 1, 2025
68 ఏళ్ల ఏకగ్రీవానికి ముగింపు.. తెల్దారుపల్లిలో ఈసారి ఎన్నికల్లేవ్

ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికలకు దూరమైంది. దాదాపు 68 ఏళ్లుగా (1957 నుంచి) 13 సార్లు ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకుని, కమ్యూనిస్టులకు కంచుకోటగా నిలిచిన ఈ గ్రామం చరిత్రలో మొదటిసారి ఎన్నికల్లో పాల్గొనడం లేదు. తెల్దారుపల్లి ఇటీవల ఏదులాపురం మున్సిపాలిటీలో విలీనం కావడంతో ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు దూరమైందని అధికారులు తెలిపారు. దీంతో గ్రామంలో ఈసారి ఎన్నికల సందడి కనిపించడం లేదు.
News December 1, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} ఖమ్మం నూతన డీసీసీ అధ్యక్షుడు ప్రమాణస్వీకారం
∆} రెండో రోజు కొనసాగుతున్న రెండో విడత నామినేషన్లు
∆} మధిర మృత్యుంజయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం జిల్లాకు వర్ష సూచన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం.
News November 30, 2025
ఎన్నికలు.. ప్రజావాణి తాత్కాలిక రద్దు: ఖమ్మం కలెక్టర్

ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పనుల్లో అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున, కలెక్టరేట్లో ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదివారం ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రజావాణి నిలిపివేయబడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అందరూ గమనించి, సహకరించాలని ఆయన సూచించారు.


