News February 24, 2025

ఖమ్మం: పోక్సో కేసు నిందితుడు అరెస్ట్:సీఐ 

image

రఘునాథపాలెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. నాలుగు రోజులు కిందట నమోదైన పోక్సో కేసులో ఖమ్మం రూరల్ మండలం పోలిశెట్టిగూడెంకు చెందిన వంశీని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Similar News

News December 10, 2025

ఖమ్మం: 18 రకాల కార్డులతో ఓటేయవచ్చు: కలెక్టర్

image

ఈ నెల 11, 14, 17 తేదీల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటరు గుర్తింపు కార్డు లేని పక్షంలో, ఇతర 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని వెంట తీసుకెళ్లవచ్చని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ప్రతి ఓటరు ఓటు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.

News December 10, 2025

ఈ-కేవైసీ కారణంతో రద్దయిన రేషన్ కార్డులెన్ని?:ఎంపీ

image

దేశంలో ఈ-కేవైసీ చేయించుకోని కారణంగా రద్దయిన రేషన్ కార్డుల గణాంకాలను తెలపాలని ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి బుధవారం లోక్‌సభలో కేంద్రాన్ని కోరారు. దీనికి కేంద్ర వినియోగదారులు ఆహార ప్రజాపంపిణీ సహాయ మంత్రి నిముబెన్ జయంతి బాయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అక్టోబరు నాటికి రాష్ట్రాల వారీగా రద్దయిన కార్డులు, ప్రస్తుత కార్డుల వివరాలను ఆమె సభకు అందించారు.

News December 10, 2025

ఖమ్మంలో తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

image

ఖమ్మం జిల్లాలో ఏడు మండలాల్లోని 172 సర్పంచ్, 1,415 వార్డు స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి 1గంట వరకు పోలింగ్.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ విడతలో 2,41,137 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 2,089 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేసి, 4,220 మంది సిబ్బందిని విధుల్లో నియమించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.