News February 5, 2025

ఖమ్మం పోలీసులకు 42 పతకాలు.. సీపీ అభినందన

image

ఇటీవల కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌లో వివిధ విభాగాల్లో జిల్లా ఉద్యోగులు 42 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఖమ్మం సీపీ సునీల్ దత్ కమిషనర్ కార్యాలయంలో పోలీసు క్రీడాకారులను అభినందించి మాట్లాడారు. సవాళ్లు, ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేస్తూనే క్రీడల్లో పతకాలు సాధించడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయి స్పోర్ట్స్ మీట్‌లోనూ పతకాలు సాధించాలని కాంక్షించారు.

Similar News

News January 7, 2026

సిరిసిల్ల: ‘పనులు త్వరితగతిన పూర్తి చేయాలి’

image

ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో రూ.ఐదు కోట్ల నిధులతో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) భవన నిర్మాణ పనులను బుధవారం ఆమె పరిశీలించారు. పనుల పురోగతిని నిత్యం పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

News January 7, 2026

సిద్దిపేట: ఆహారం భద్రంగా.. ఆరోగ్యం పదిలంగా !

image

ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌ హైమావతి స్పష్టం చేశారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ఫుడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే విక్రేతలపై కఠినంగా వ్యవహరించాలని, కల్తీలేని ఆహారాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ఆహార భద్రతా ప్రమాణాలు పాటించేలా క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు.

News January 7, 2026

పోర్టు వరకు పోలవరం నావిగేషన్ కెనాల్: CBN

image

AP: ఉత్పత్తుల జలరవాణా కోసం పోలవరం నుంచి విశాఖ పోర్టువరకు నావిగేషన్ కెనాల్‌ నిర్మిస్తున్నట్లు CM CBN తెలిపారు. దీనిద్వారా MH, TG తదితర ప్రాంతాల ఉత్పత్తులను భద్రాచలం మీదుగా జలమార్గంలో తరలించవచ్చని చెప్పారు. పోర్టు ద్వారా వీటిని విదేశాలకు ఎగుమతి చేయడం సులభమవుతుందని వివరించారు. ముందు చూపుతో ఈ కెనాల్‌ను ప్రాజెక్టు ప్రణాళికలో పెట్టించినట్లు వివరించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు సాగు నీరందిస్తామన్నారు.