News February 5, 2025
ఖమ్మం పోలీసులకు 42 పతకాలు.. సీపీ అభినందన

ఇటీవల కరీంనగర్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో వివిధ విభాగాల్లో జిల్లా ఉద్యోగులు 42 పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఖమ్మం సీపీ సునీల్ దత్ కమిషనర్ కార్యాలయంలో పోలీసు క్రీడాకారులను అభినందించి మాట్లాడారు. సవాళ్లు, ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేస్తూనే క్రీడల్లో పతకాలు సాధించడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయి స్పోర్ట్స్ మీట్లోనూ పతకాలు సాధించాలని కాంక్షించారు.
Similar News
News February 10, 2025
30 ఏళ్లు దాటిన మహిళలు ఈ పరీక్షలు చేసుకోవాలి!

1. మామోగ్రఫీ- దీని ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు గుర్తించవచ్చు. 2.పాప్ స్మియర్ టెస్ట్ – గర్భాశయ క్యాన్సర్‌ను ముందుగా గుర్తించవచ్చు. 3.కంప్లీట్ బ్లడ్ కౌంట్(CBC)- రక్తహీనతతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలను దీని ద్వారా గుర్తించవచ్చు. 4. థైరాయిడ్ 5. విటమిన్ -D, కాల్షియం టెస్ట్. ఈ పరీక్షలు చేయించుకొని దానికి తగ్గట్లు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
SHARE IT
News February 10, 2025
సీఎం రేవంత్‌కు లేఖ రాసిన మందకృష్ణ

TG: ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు MRPS స్థాపకుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ‘జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నాయి. లోపాల వల్ల కొన్ని కులాల హక్కులు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. నివేదికపై చర్చించి సూచనలు ఇవ్వడానికి సీఎంను కలవాలని అనుకుంటున్నాం. సాధ్యమైనంత త్వరలో మీ విలువైన సమయాన్ని కేటాయించాలని కోరుతున్నాం’ అని లేఖలో విజ్ఞప్తి చేశారు.
News February 10, 2025
రంగరాజన్‌ను పరామర్శించిన కొండా సురేఖ

TG: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను మంత్రి కొండా సురేఖ పరామర్శించారు. ఆయనపై జరిగిన దాడి గురించి ఆమె ఆరా తీశారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని ఆయనకు భరోసా ఇచ్చారు. నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కాగా పూజారిపై దాడికి పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.