News April 10, 2025

ఖమ్మం: పోలీసు జాగిలం యామి మృతి

image

పోలీస్‌ శాఖలో 9 ఏళ్లుగా విశేష సేవలందించిన పోలీసు జాగిలం యామి (ఫిమేల్ డాగ్) అనారోగ్యంతో మృతి చెందింది. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచనల మేరకు పోలీస్‌ అధికారులు పుష్పగుచ్ఛాలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికారిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. యామి (జాగిలం) లబ్రాడార్‌ రిట్రీవర్‌ సంతతికి చెందింది.

Similar News

News December 2, 2025

HYD: ప్రేమ జంట ఆత్మహత్య(UPDATE)

image

రంగారెడ్డి జిల్లా కొత్తూరులో <<18443763>>ప్రేమ జంట<<>> ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా, కొత్తూరు పట్టణంలో ఓ బేకరీ పరిశ్రమలో పనిచేస్తున్న అనామిక అదే కంపెనీలో బిహార్‌కు చెందిన ధనుంజయ్‌‌‌‌‌‌ను ప్రేమించింది. అనామిక పరిశ్రమకు వెళ్లకపోవడంతో ధనుంజయ్‌ ఆమెకు ఫోన్ చేసి ఇంటికి వచ్చాడు. తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించా

News December 2, 2025

జగిత్యాల సర్పంచ్‌కి 508.. కరీంనగర్ సర్పంచ్‌కి 431

image

స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్‌లో రెండోవిడతలో 418 GPలకు, 3794 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా రెండో విడతకు సంబంధించి రెండోరోజు జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు కరీంనగర్ జిల్లా సర్పంచ్‌కి 431, వార్డు సభ్యులకు 1287, సిరిసిల్ల జిల్లా సర్పంచికి 311, వార్డు సభ్యులకు 692, జగిత్యాల సర్పంచ్‌కి 508, వార్డు సభ్యులకు 1279, PDPL సర్పంచ్‌కి 295, వార్డు సభ్యులకు 810 నామినేషన్లు వచ్చాయి.

News December 2, 2025

నల్గొండ: గ్రామాల్లో అంతర్గత పోరుతో రాజకీయ హీట్

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్లు ప్రారంభం కానుండడంతో ప్రధాన పార్టీల్లో రాజకీయం తారాస్థాయికి చేరింది. ఒకే పార్టీ నుంచి పలువురు నేనే సర్పంచ్ అంటూ బరిలో దూసుకురావడంతో అంతర్గత పోరు మొదలైంది. ఇతర పోస్టులు సర్దుబాటు చేస్తామని నేతలు బుజ్జగిస్తున్నా వినకుండా స్వతంత్రగానైనా పోటీ చేస్తామంటూ సిద్ధం కోవడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది.