News April 10, 2025

ఖమ్మం: పోలీసు జాగిలం యామి మృతి

image

పోలీస్‌ శాఖలో 9 ఏళ్లుగా విశేష సేవలందించిన పోలీసు జాగిలం యామి (ఫిమేల్ డాగ్) అనారోగ్యంతో మృతి చెందింది. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచనల మేరకు పోలీస్‌ అధికారులు పుష్పగుచ్ఛాలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికారిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. యామి (జాగిలం) లబ్రాడార్‌ రిట్రీవర్‌ సంతతికి చెందింది.

Similar News

News January 25, 2026

HYD: వారిని పెళ్లి చేసుకుంటే రూ.లక్ష..!

image

దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సాధారణ వ్యక్తి దివ్యాంగుడిని లేదా దివ్యాంగురాల్ని వివాహమాడితే రూ.లక్ష ప్రోత్సాకాన్ని అందిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా శిశు, మహిళా సంక్షేమ అధికారి తెలిపారు. వరుడు లేదా వధువు 40% దివ్యాంగత సర్టిఫికెట్ కలిగి ఉండి పెళ్లైన ఏడాదిలోపు మ్యారేజ్ సర్టిఫికెట్‌తో అప్లై చేసుకోవాలన్నారు. వివరాలకు telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ సందర్శించాలన్నారు.

News January 25, 2026

మంచిర్యాల: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మోసం

image

వివాహితను ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. SI కథనం ప్రకారం.. లక్షెట్టిపేటలోని ఓ కాలనీకి చెందిన విడాకులు తీసుకున్న మహిళకు అదే ప్రాంతానికి చెందిన సాయికిరణ్‌ పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు పెళ్లి ప్రస్తావన తేగా నిరాకరించడంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

News January 25, 2026

విజయవాడలో కేజీ చికెన్ ధర ఎంతంటే!

image

విజయవాడలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్‌‌ లెస్ కేజీ రూ. 310, స్కిన్‌ రూ. 300 విక్రయిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు ఉన్నట్లు విక్రయదారులు చెబుతున్నారు. మటన్ కేజీ రూ.1000గా ఉంది. చేపల్లో బొచ్చ కేజీ రూ. 220గా ఉంది. 30 కోడిగుడ్లు గతవారం రూ. 180 ఉండగా నేడు రూ. 152కి అమ్ముతున్నారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.