News May 24, 2024

ఖమ్మం: ప్రచార పర్వానికి రేపటితో తెర

image

ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వీరందరూ శుక్రవారం వరకు ఓటు వేసే అవకాశం ఉంది. ప్రచార పర్వానికి శనివారం సాయంత్రానికి తెరపడనుంది. సోమవారం ఉదయం 7నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఖమ్మం జిల్లాలో 118, భద్రాద్రిలో 55 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Similar News

News February 19, 2025

ఖమ్మం: వడదెబ్బపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి:కలెక్టర్ 

image

ఖమ్మం: వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం వడగాల్పుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యశాఖ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని, గత సంవత్సరం దాదాపు 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని కలెక్టర్ తెలిపారు.

News February 19, 2025

ఖమ్మం జిల్లా TOP NEWS

image

✓ఖమ్మం జిల్లాలో విషాదం.. రైతు ఆత్మహత్య✓జిల్లా వ్యాప్తంగా ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు✓ఖమ్మం: బెట్టింగ్ భూతానికి యువకుడు బలి✓ తిరుమలాయపాలెంలో ఎరువులు కొరత✓పెనుబల్లి:వ్యక్తిని ఢీకొట్టిన టీవీఎస్.. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి✓ పెరుగుతున్న ఎండలు.. కలెక్టర్ రివ్యూ ✓ఖమ్మం: ముగ్గురు మంత్రులు ఉండి రైతులను పట్టించుకోరా:MLC ✓ఏన్కూర్ మండల ప్రజలకు GOODNEWS✓ పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్: మంత్రి తుమ్మల

News February 19, 2025

ఖమ్మం: పంటల రక్షణకు సోలార్ ఫెన్సింగ్: మంత్రి

image

అడవి జంతువులు, కోతుల నుంచి రక్షణ కోసం సోలార్ ఫెన్సింగ్ పథకం ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వ్యవసాయశాఖ మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. పామాయిల్‌తో పాటు ఇతర పంటలకు డ్రిప్, తుంపర సేద్య పరికరాలను రైతులకు అందించాలని కోరారు. రాష్ట్ర అవసరాలు తీర్చేలా కూరగాయల సాగు పెంపునకు పెరి అర్బన్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.

error: Content is protected !!