News December 19, 2024

ఖమ్మం: ప్రజాశాంతి పార్టీ గెలిస్తే సమగ్ర అభివృద్ధి: KA పాల్ 

image

గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఓడించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ప్రజాశాంతి పార్టీ ద్వారా సర్పంచ్‌గా గెలిస్తే భారీగా నిధులు కేటాయిస్తూ వంద రోజుల్లో ఆ గ్రామాలను సమగ్ర అభివృద్ధి చేసి చూపిస్తామని గురువారం ఖమ్మంలో జరిగిన సమావేశంలో చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయలేక బీజేపీ, కాంగ్రెస్ దేశ ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.

Similar News

News December 27, 2025

అక్రమ రవాణాపై పోలీసుల ఉక్కుపాదం: సీపీ సునీల్ దత్

image

ఖమ్మం జిల్లాలో అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాల కట్టడికి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు CP సునీల్ దత్ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి గంజాయి, ఇసుక, రేషన్ బియ్యం తరలించే ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఇందులో భాగంగా తనిఖీలను ముమ్మరం చేసినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని, అలాగే డ్రంక్&డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు.

News December 27, 2025

ప్రయాణికులకు ఊరట.. ఖమ్మం మీదుగా 10 ప్రత్యేక రైళ్లు

image

సంక్రాంతి పండగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఖమ్మం మీదుగా మొత్తం పది ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు స్టేషన్ చీఫ్ కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ డి.రాజగోపాల్ వెల్లడించారు. ఇందులో ఐదు రైళ్లు ఖమ్మం మీదుగా రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. జనవరి 9 నుంచి 20 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

News December 27, 2025

ఖమ్మం: ఇయర్ ఎండింగ్ ఎఫెక్ట్.. తగ్గిన రిజిస్ట్రేషన్లు

image

ఖమ్మం రవాణాశాఖ ఆఫీస్‌లో రోజుకు 50 నుంచి 60 వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. కానీ గత ఐదు రోజులుగా ఈ రద్దీ సగానికి పైగా తగ్గింది. కొత్త సంవత్సరం, సంక్రాంతి సమయంలో వాహనాలు కొనవచ్చని చాలా మంది వేచి చూస్తుంటారు. అంతే కాకుండా వాహనాల షోరూంలు పలు ఆఫర్లు ప్రకటించి విక్రయాలు జరుపుతుంటాయి. దీంతో ఆ ప్రభావం రవాణా శాఖపై పడింది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఆర్డీవో ఆఫీస్, కేఎంసీ రహదారి ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తోంది.