News September 13, 2024

ఖమ్మం: ‘ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు’

image

ఈనెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి.శ్రీజ, డి.మధుసూదన్ నాయక్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు చెప్పారు.

Similar News

News December 5, 2025

ఖమ్మం: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృతి చెందిన ఘటన గురువారం చింతకాని మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నేరడకు చెందిన కంచం డేవిడ్(20) తన ఇంట్లో కరెంటు మీటర్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. డేవిడ్ మృతితో వారి కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News December 5, 2025

చంద్రుగొండలో రేషన్ బియ్యం పట్టివేత

image

చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా 280 క్వింటాళ్ల రేషన్ బియ్యం (విలువ రూ.5.60 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ అరుణ్‌కుమార్, రాజ్‌బార్ విచారణలో బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఛత్తీస్‌గఢ్‌కు అధిక ధరలకు తరలిస్తున్నట్లు ఒప్పుకొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

News December 5, 2025

ఖమ్మం: గంజాయి నిందితులకు జైలు శిక్ష

image

గంజాయి నిందితులకు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవి తీర్పునిచ్చారు. ఖమ్మం-వరంగల్‌ క్రాస్‌ రోడ్డుతో పాటు కొత్త బస్టాండ్ వద్ద గంజాయి తరలిస్తూ 2022 ఏప్రిల్ 10, 2024 జనవరి 10న నిందితులు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు వారిని గురువారం కోర్టులో హాజరు పరచారు. ఒక్కొక్కరికి 20, 10 సం.ల జైలు శిక్షలతో పాటు రూ.లక్ష చొప్పున జరిమానా విధించారు.