News March 14, 2025

ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో టెండర్లకు ఆహ్వానం

image

ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రెండేళ్ల కాల పరిమితితో మందులు, శస్త్ర చికిత్స వినియోగ వస్తువులు, ప్రయోగశాల రసాయనాలు, ఆర్థో ఇంప్లాంట్లు, క్యాత్-ల్యాబ్ ఇంప్లాంట్ల కోసం టెండర్లు కోరుతున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎల్.కిరణ్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల ఏజెన్సీలు మార్చి 20 లోగా టెండర్ ఫారాలు తీసుకొని, దరఖాస్తులను ఏప్రిల్ 11 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాల్సి ఉంటుందని వెల్లడించారు.

Similar News

News March 15, 2025

KMM: ఏడాదిలో 16మంది ఏసీబీకి చిక్కారు..!

image

ఉమ్మడి ఖమ్మంలో అవినీతి అధికారులు పెరిగిపోతున్నారు. ఏడాదిలో దాదాపు 16 మంది అధికారులు ఏసీబీ అధికారులకు పట్టబడ్డారు. రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నా, ఆఖరికి రూ.1500కు కూడా కక్కుర్తి పడి ఏసీబీకి చిక్కుతున్నారు. ఇంకా గుట్టుచప్పుడు కాకుండా ఎంత నడుస్తోందోనని జిల్లావాసులు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం విషయంలో ఇబ్బంది పెడితే తమను సంప్రదించాలని ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేశ్ సూచిస్తున్నారు.

News March 15, 2025

ఎర్రుపాలెం: అప్పులు బాధ తాళలేక రైతు ఆత్మహత్య

image

అప్పులు బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎర్రుపాలెం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మొలుగుమాడుకి చెందిన తోట వెంకటేశ్వరరావు అనే రైతు తనకున్న రెండున్నర ఎకరాల పొలంతో పాటు మరో 5ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట సాగు చేశాడు. పంట సరిగా పండకపోవడంతో చేసిన అప్పులు తీర్చలేక బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 15, 2025

మంత్రి ఉత్తమ్‌తో మంత్రి తుమ్మల భేటీ

image

రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. సత్తుపల్లి ట్రంక్, సీతారామ ప్రాజెక్ట్ పురోగతి, భూసేకరణ, ఖర్చు, నాణ్యత, భవిష్యత్ ప్రణాళికలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం సత్తుపల్లి ట్రంక్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో మిగిలిన పనుల పురోగతిని సమీక్షిస్తూ ప్రాజెక్ట్ నాణ్యత, ఖర్చుల సమీక్ష, పనివేగంపై తుమ్మల విశ్లేషించారు.

error: Content is protected !!