News April 24, 2025
ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తప్పని నీటి కష్టాలు

ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి నీటి కష్టాలు పొంచి ఉన్నాయి. ఓ పక్క భూగర్భ జలాలు అడుగంటడం, మరో పక్క మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రోజు విడిచి రోజు నీటి సరఫరాతో కష్టాలు తప్పేలా లేవు. అంతేకాక బోర్ల ద్వారా కూడా సరఫరా తగ్గిపోతుండటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ఈ ఏడాది నీళ్ల ముప్పు ఎదురుకానుంది. ఖమ్మం నగరంలో మంచినీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
Similar News
News April 25, 2025
నేడు పహల్గామ్‌కు రాహుల్ గాంధీ

లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నేడు జమ్మూకశ్మీర్‌కు వెళ్లనున్నారు. ఉగ్రదాడి జరిగిన పహల్గామ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించనున్నారు. ముష్కరుల దాడి సమయంలో అమెరికాలో ఉన్న రాహుల్ ఆ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసి భారత్‌కు వచ్చారు. కాగా నిన్న జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఉగ్రదాడి ఘటనపై ప్రభుత్వానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
News April 25, 2025
భారత్, పాక్ సంయమనం పాటించాలి: UN

పాకిస్థాన్‌పై భారత్ యుద్ధానికి సిద్ధమవుతోందన్న వార్తల నడుమ ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. రెండు దేశాలూ వీలైనంత సంయమనం పాటించాలని యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. పరిస్థితిని మరింత దిగజారనివ్వొద్దని సూచించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడిని నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని, ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాలని కోరారు.
News April 25, 2025
బుడగట్లపాలెం : సీఎం చేతుల మీదుగా రూ. 250 కోట్ల పంపిణీ

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మత్స్యకార భరోసా పథకం కింద 250 కోట్ల రూపాయలు పంపిణీకి సిద్ధం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుడగట్లపాలెంలో గురువారం ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 26న నిధులు పంపిణీకి ముఖ్యమంత్రి రానున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి, అధికారులు ఉన్నారు.