News June 19, 2024
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి బుధవారం జిల్లా కలెక్టర్ అబ్దుల్ ముజామిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో తిరుగుతూ అక్కడ చికిత్స పొందుతున్న రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో పలు రికార్డులను పరిశీలించి, వైద్య అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News November 22, 2025
ఖమ్మం: గురుకులాల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులకు ఆహ్వానం

ఖమ్మం జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025–26కి 5 నుంచి 9వ తరగతులల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. అర్హులైన వారు నవంబర్ 25 సాయంత్రం 5 వరకు ఖమ్మం అంబేడ్కర్ జూనియర్ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు తప్పనిసరి. వీటీజీ/బీఎల్వీ సెట్ రాసిన వారికి ప్రాధాన్యత, ఇతరులకు లాటరీ ద్వారా ఎంపిక ఉంటుందన్నారు.
News November 22, 2025
ఖమ్మం: మారుతి ఆగ్రోటెక్ ఉద్యోగాల కోసం జాబ్ మేళా

ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం శనివారం ఉదయం 10 గంటలకు టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. మారుతి ఆగ్రోటెక్ అండ్ ఫర్టిలైజర్స్ (HYD) కంపెనీలోని మార్కెటింగ్ సేల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎస్సెస్సీ లేదా డిగ్రీ అర్హతతో 20-40 ఏళ్ల వయస్సు గలవారు అర్హులని, వేతనం రూ.20,000– 30,000 ఉంటుందని ఆయన తెలిపారు.