News June 19, 2024

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

image

ఖమ్మంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి బుధవారం జిల్లా కలెక్టర్ అబ్దుల్ ముజామిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలో తిరుగుతూ అక్కడ చికిత్స పొందుతున్న రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో పలు రికార్డులను పరిశీలించి, వైద్య అధికారులకు పలు సూచనలు చేశారు.

Similar News

News September 15, 2024

ఖమ్మం: ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చే ప్రభుత్వం మాది: భట్టి

image

ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చే ప్రభుత్వం తమదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 2029-30 వరకు రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్‌ను ఉత్పత్తి చేస్తామని, విద్యుత్ విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తామని చెప్పారు. గత పాలకుల లాగా రాష్ట్ర సంపదను దోపిడీ చేసేందుకు సిద్ధంగా లేమని, కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్న వాళ్లకు చంప దెబ్బ కొట్టేలా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు.

News September 14, 2024

KMM: గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు: సీపీ

image

గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ట్రాఫిక్ ఆంక్ష‌ల నేపథ్యంలో ఈనెల 16 సోమవారం నాడు ఖమ్మం నగరంలో వాహనదారులు గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర జరిగే రూట్లు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. అటు నగరంలో శోభాయాత్ర జరిగే మార్గాలు, వాహనదారుల ప్రత్యామ్నాయ మార్గాల మ్యాపును సీపీ విడుదల చేశారు.

News September 14, 2024

చర్ల: సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు

image

చర్ల సరిహద్దులోని అడవుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. పూర్వాతి గ్రామంలో పోలీసుల బేస్ క్యాంపుపై మావోయిస్టులు దాడులు చేశారు. భద్రతా బలగాలపై మావోయిస్టులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. దీన్ని భద్రతా బలగాలు గట్టిగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.