News July 15, 2024
ఖమ్మం: ప్రభుత్వ బాలికల హాస్టల్‌ను సందర్శించిన ఎంపీ
ఖమ్మం నగరంలోని ప్రభుత్వ బాలికల హాస్టల్‌ను సోమవారం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. హాస్టల్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఎంపీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు యుగేందర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 13, 2024
భద్రాచలంలో పేలిన గ్యాస్ సిలిండర్
భద్రాచలం పట్టణంలోని హోటల్ గీతాంజలి వీధిలో ఉన్న ఓ ఇంట్లో మహిళ దీపారాధన చేసింది. అనంతరం ఆరుబయట పనిచేస్తూ ఉండగా గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదానికి గురైంది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాగా ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేశారు.
News October 13, 2024
కల్లోజి జయమ్మ మృతి పట్ల ఎంపీ సంతాపం
సీనియర్ జర్నలిస్టు, టీయూడబ్ల్యూజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్ మాతృమూర్తి కల్లోజి జయమ్మ ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మరణవార్త తెలిసి.. రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తల్లిని కోల్పోయి దు:ఖంలో ఉన్న శ్రీనివాస్ కు ఎంపీ రవిచంద్ర ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు.
News October 13, 2024
త్వరలో రైతులకు ఉచితంగా సోలార్ పంపుసెట్లు: డీప్యూటీ సీఎం భట్టి
రైతులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. రైతుల బోరు బావులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని వల్ల అన్నదాతలకు అదనపు ఆదాయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అశ్వారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో నిర్మించిన పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పాల్గొని మాట్లాడారు.