News March 10, 2025
ఖమ్మం ప్రయోజనాలపై ఎమ్మెల్యేలు, మంత్రుల భేటీ

ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆదివారం HYDలో Dy.CM భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వెంకట్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో ఖమ్మం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారని సమాచారం. ఎమ్మెల్యేలు కనకయ్య, రాగమయి, వెంకటేశ్వర్లు, వెంకట్రావు, ఆదినారాయణ, రాందాస్ నాయక్, ఎంపీ బలరాం నాయక్ పాల్గొన్నారు.
Similar News
News March 10, 2025
రంగారెడ్డి జిల్లాలో పరీక్ష రాసింది ఎందరంటే?

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 185 సెంటర్లలో 71,726 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా.. 70,271 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 1,455 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షలు పూర్తైన అనంతరం ఆన్సర్ పేపర్లను స్ట్రాంగ్ రూమ్స్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
News March 10, 2025
నిర్బంధాల కట్టడిని చిత్తడి చేసిన మిలియన్ మార్చ్: హరీశ్ రావు

ఆంక్షలు, నిర్బంధాల కట్టడిని చిత్తడి చేసి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను మిలియన్ మార్చ్ నెరవేర్చిందని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ‘X’ లో పేర్కొన్నారు. మిలియన్ మార్చ్ నిర్వహించి ఈరోజుకు 14 ఏళ్లు అవుతుండగా జల మార్గం ద్వారా ట్యాంక్ బండ్ చేరుకున్న ఫోటోను హరీశ్ రావు పోస్ట్ చేశారు. స్వరాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు చూపిన పోరాటానికి, తెగువకు సెల్యూట్ చెప్పారు.
News March 10, 2025
కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు: KTR

TG: ఈనెల 12 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలకు BRS అధినేత KCR హాజరవుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘బడ్జెట్ ప్రసంగంలో కేసీఆర్ పాల్గొంటారు. ఆయన వచ్చి కాంగ్రెస్ నేతల అబద్ధాలు, దూషణలు పడాలా? ఇలాంటి నేతలున్న సభకు ఆయన రావాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. వీరి స్థాయికి మేం చాలు. ఆయన అవసరం లేదు’ అని తెలిపారు. ఈనెల 16 తర్వాత ఫార్ములా ఈ-రేసు కేసులో తనను మళ్లీ విచారణకు పిలుస్తారని పేర్కొన్నారు.