News June 23, 2024

ఖమ్మం: ప్రేమపేరుతో బాలికతో ఆగ్రాకు.. పోక్సో కేసు నమోదు

image

ఖమ్మంలో ఓ యువకుడు పదో తరగతి విద్యార్థినిని ఆగ్రాకు తీసుకెళ్లిన ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఖమ్మంకి చెందిన సాయికి క్రీడల్లో ప్రావీణ్యం ఉంది. తాను చదువుకున్న స్కూల్‌లో ఆటలు నేర్పుతూ విద్యార్థులకు దగ్గరయ్యాడు. ఈ క్రమంలో విద్యార్థినిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడగా ఓసారి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. తీరు మార్చుకోని సాయి, అమ్మాయిని బెదిరించి ఆగ్రాకు తీసుకెళ్లాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది. 

Similar News

News November 5, 2024

చింతకాని: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు

image

చింతకాని మండలంలోని ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రతిభను చాటుకున్నారు. డీఎస్సీ 2024లో ఈ కుటుంబానికి చెందిన ముగ్గురు సూపర్ సక్సెస్‌ సాధించి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా జాబ్ కొట్టారు. ఈలప్రోలు కృష్ణారావు స్కూల్ అసిస్టెంట్‌గా, ఆయన సోదరుడు నరేష్, సోదరి సునీతలు ఎస్‌జీటీ పోస్టుల్లో సెలెక్ట్‌ అయ్యి విధుల్లో చేరారు. గ్రామస్థులు, బంధుమిత్రులు వారికి అభినందనలు తెలిపారు.

News November 5, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ప్రత్యేక అధికారిగా కె. సురేంద్ర మోహన్ నియామకం

image

రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్​ను ప్రత్యేక అధికారిగా నియమించింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు కె. సురేంద్ర మోహన్‌‌ను ప్రత్యేక అధికారిగా నియమించారు.

News November 5, 2024

పక్కా ప్రణాళికతో ఇంటింటి సర్వే: జిల్లా కలెక్టర్

image

ఖమ్మం: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లాలో పక్కా ప్రణాళికతో, ఏ దశలోనూ పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. సోమవారం కుటుంబ సర్వేకు సంబంధించి అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. జిల్లాలో సుమారు 6,33,304 కుటుంబాలున్నట్లు అంచనా ఉందన్నారు. ప్రతి ఇంటి సర్వేకు పటిష్ట ప్రణాళిక చేశామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.