News February 28, 2025

ఖమ్మం: బర్డ్ ఫ్లూ భయం.. చికెన్ షాపులు వెలవెల!

image

బర్డ్ ఫ్లూ వైరస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చికెన్ షాపుల నిర్వాహకులపై గుదిబండలా మారింది. కేజీ ధర రూ. 180 ఉన్నా వైరస్ భయంతో చికెన్ కొనుగోళ్లకు మొగ్గు చూపడం లేదు. ప్రత్యామ్నాయంగా మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది. రూ. 800 ఉన్న మటన్ రూ. 100, చేపలు రకాన్ని బట్టి కేజీకి రూ. 50-100 ఎక్కువ పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలతో మాంసం ప్రియులు నోటికి తాళం వేస్తున్నారు.

Similar News

News November 8, 2025

యువతకు భద్రత కల్పించండి: SP

image

యువత భవిష్యత్తుకు భద్రత కల్పించాలని SP ధీరజ్ కునుబిల్లి శనివారం జిల్లా పోలీసులను ఆదేశించారు. ‘శక్తి’ టీమ్ బృందాలు జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో వినూత్నంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. సోషల్ మీడియా దుర్వినియోగం, సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, వైట్ కాలర్ నేరాల నివారణపై విద్యార్థులకు పోలీసులు వివరించారు. తప్పుడు సమాచారం (ఫేక్ న్యూస్) షేర్ చేయడం వలన ఎదురయ్యే సమస్యల గురించి వివరించారు.

News November 8, 2025

బండి సంజయ్ హాట్ కామెంట్స్

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇది హిందూ, ముస్లింల మధ్య జరుగుతున్న వార్. మొలతాడు ఉన్నోళ్లకు, లేనోళ్లకు, బొట్టు పెట్టుకున్నోళ్లకు, పెట్టుకోనోళ్లకు మధ్య పోటీ. 80% ఉన్న హిందువులు గెలుస్తారా? 20% ఉన్న ముస్లింలా? హిందువుల పక్షాన BJP, ముస్లింల వైపు INC ఉంది. TGని ఇస్లామిక్ స్టేట్‌గా మార్చేందుకు రేవంత్ కుట్ర చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు.

News November 8, 2025

నాగిరెడ్డిపేట: పురుగుల మందు సేవించి వృద్ధురాలి మృతి

image

నాగిరెడ్డిపేట మండలంలోని లింగంపల్లి కలన్ గ్రామానికి చెందిన రోడ్డ రత్నవ్వ (70) పురుగుల మందు సేవించి మృతి చెందినట్లు స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, జీవితంపై విరక్తి చెంది రత్నవ్వ ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె కుమార్తె రోడ్డ సాయవ్వ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.