News February 28, 2025
ఖమ్మం: బర్డ్ ఫ్లూ భయం.. చికెన్ షాపులు వెలవెల!

బర్డ్ ఫ్లూ వైరస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చికెన్ షాపుల నిర్వాహకులపై గుదిబండలా మారింది. కేజీ ధర రూ. 180 ఉన్నా వైరస్ భయంతో చికెన్ కొనుగోళ్లకు మొగ్గు చూపడం లేదు. ప్రత్యామ్నాయంగా మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది. రూ. 800 ఉన్న మటన్ రూ. 100, చేపలు రకాన్ని బట్టి కేజీకి రూ. 50-100 ఎక్కువ పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలతో మాంసం ప్రియులు నోటికి తాళం వేస్తున్నారు.
Similar News
News March 1, 2025
పెనుబల్లి: చిన్నారిపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్ట్

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం కలకలంరేపింది. మద్యం మత్తులో ఉన్న దుంప వెంకటేశ్వరరావు చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వీ.ఎం.బంజర్ పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 1, 2025
టీచర్ MLC ఎన్నికల రిజల్ట్‌పై ఉత్కంఠ!

KMM, WGL, NLG టీచర్ MLC ఎన్నికల రిజల్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఎవరికి వారు గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. ప్రధానంగా PRTU నుంచి శ్రీపాల్ రెడ్డి, UTF నుంచి నర్సిరెడ్డి, స్వతంత్రంగా పూల రవీందర్, BJP సరోత్తం రెడ్డి, సుందర్‌రాజ్, హర్షవర్ధన్ రెడ్డిలు ఉండగా.. శ్రీపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి, రవీందర్‌ల మధ్యే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. రిజల్ట్ కోసం మరో 2 రోజులు చూడాల్సిందే.
News March 1, 2025
భద్రాద్రి: ఇద్దరు యవకులు మృతి.. అక్కా చెల్లెళ్లకు కడుపుకోత!

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు <<15610313>>గల్లంతయి<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతులు వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం హరిదాసుపల్లెకు చెందిన హరి ప్రసాద్(20), ఖమ్మం రఘునాథపాలెం రేగులచెలకకు చెందిన పవన్(20) గా పోలీసులు గుర్తించారు. భద్రాచలం స్వామివారి దర్శనానికి వెళ్లగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వీరి ఇద్దరి తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు. సీఐ రమేశ్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.