News February 28, 2025
ఖమ్మం: బర్డ్ ఫ్లూ భయం.. చికెన్ షాపులు వెలవెల!

బర్డ్ ఫ్లూ వైరస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చికెన్ షాపుల నిర్వాహకులపై గుదిబండలా మారింది. కేజీ ధర రూ. 180 ఉన్నా వైరస్ భయంతో చికెన్ కొనుగోళ్లకు మొగ్గు చూపడం లేదు. ప్రత్యామ్నాయంగా మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది. రూ. 800 ఉన్న మటన్ రూ. 1000, చేపలు రకాన్ని బట్టి కేజీకి రూ. 50-100 ఎక్కువ పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలతో మాంసం ప్రియులు నోటికి తాళం వేస్తున్నారు.
Similar News
News March 1, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు!

✓ వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ✓ జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ✓ సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన ✓ ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ✓ వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ✓ మధిర శివాలయంలో హుండీ లెక్కింపు ✓ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పునఃప్రారంభం.
News March 1, 2025
యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు:ఎస్ఐ

పెళ్లి చేసుకుంటానని మహిళను గర్భవతిని చేసి ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత పెళ్లి చేసుకోను అని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కూచిపూడి జగదీష్ తెలిపారు. వివరాల ప్రకారం.. తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన బాధితురాలు (25) ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడుకి చెందిన చిర్రా మహేష్ మోసం చేశాడని ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
News March 1, 2025
‘మీసేవ’ కేంద్రాల్లో విజిలెన్స్ తనిఖీలు

తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ ( టీజీఎస్టీఎస్) ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ‘మీసేవ’ కేంద్రాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా వరంగల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తమ పరిధిలోని ఖమ్మం జిల్లాలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి మీసేవ కేంద్రంలో తనిఖీలు చేశారు.