News March 23, 2025
ఖమ్మం: బావిలో పడి మహిళా కూలీ మృతి

ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మహిళా కూలీ మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. నాగులవంచ గ్రామానికి చెందిన కూరపాటి రాంబాయి (54) అనే మహిళ శనివారం ఉదయం కూలీ పనికి వెళ్లగా తాగునీరు కోసం బావి దగ్గరికి వెళ్లి మంచినీరు తాగుతుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు చెప్పారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగుల మీరా కేసు నమోదు చేశారు.
Similar News
News October 29, 2025
ఖమ్మం: పత్తి మార్కెట్‌కి సెలవు

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డుకు నేడు (బుధవారం) సెలవు ప్రకటించినట్లు మార్కెట్ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. అపరాలు, మిర్చి కొనుగోళ్లు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. పత్తి క్రయవిక్రయాలు తిరిగి ఈ నెల 30న గురువారం పునఃప్రారంభమవుతాయని తెలిపారు. పత్తి విక్రయానికి రానున్న రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News October 29, 2025
ఖమ్మం జిల్లాలో నేడు స్కూళ్లు, కాలేజీలకు సెలవు

‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అన్ని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
News October 28, 2025
నేర నియంత్రణలో సాంకేతికత కీలకం: ఖమ్మం సీపీ

ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో సిటీ ఆర్ముడ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆన్లైన్ “ఓపెన్ హౌస్” మంగళవారం నిర్వహించారు. పోలీసులు వినియోగించే ఆధునిక సాంకేతిక పద్ధతులు, ఫింగర్‌ప్రింట్ యూనిట్, బాంబ్ డిస్పోజల్, సైబర్ నేరాలను పసిగట్టే విధానాలు విద్యార్థులకు చూపించారు. డాగ్ స్క్వాడ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సీపీ మాట్లాడుతూ.. సాంకేతికతతోనే నేర నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.


