News June 29, 2024

ఖమ్మం: బావిలో పడ్డ ట్రాక్టర్, దంపతులకు తీవ్రగాయాలు

image

నేలకొండపల్లి మండల పరిధిలోని భైరవునిపల్లి సమీపంలోని వ్యవసాయ బావిలో విద్యుత్ మోటర్‌ను ట్రాక్టర్‌తో కట్టి లాగుతుండగా ప్రమాదవశాత్తు బావిలో పడింది. ట్రాక్టర్‌తో పాటు భార్యభర్తలు మాధవి, బాబు ఒక్కసారిగా బావిలో పడ్డారు. భర్త బాబు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు చేరుకొని వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో భర్త క్షేమంగా బయటపడగా భార్య మాధవికి తీవ్రగాయాలయ్యాయి.

Similar News

News September 21, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు నేడు, రేపు సెలవు

image

ఖమ్మం మార్కెటుకు 2 రోజులు సెలవులను మార్కెట్ అధికారులు ప్రకటించారు. నేడు, రేపు వారాంతపు సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌ కి సరుకులు తీసుకొని రావద్దని అధికారులు సూచిస్తున్నారు. తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభమవుతుందని తెలిపారు.

News September 21, 2024

నష్టపరిహారం అందని వరద బాధితులకు ప్రత్యేక కౌంటర్లు: కమిషనర్

image

ఖమ్మం మున్నేరు వరద ముంపునకు గురై నష్ట పరిహారం అందని వరద బాధితుల వివరాల సేకరణ కోసం ప్రతి డివిజన్ నందు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. ఈ ప్రత్యేక కౌంటర్లను రేపటి నుంచి అన్ని డివిజన్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కావున వరద బాధితులు ఈ విషయాన్ని గమనించి తమ వివరాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్లను అధికారులకు అందజేయాలని పేర్కొన్నారు.

News September 21, 2024

ఎస్ఎల్బీసీ పూర్తికి నెలవారీగా నిధులు కేటాయిస్తాం: భట్టి

image

శ్రీశైలం ఎడమ కాలువ సొరంగ మార్గం (SLBC) ప్రాజెక్టును శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. అనంతరం అధికారులతో భట్టి సమీక్షించారు. ఎస్ఎల్బీసీ పూర్తికి నెలవారీగా నిధులు కేటాయిస్తామని చెప్పారు. అటు నెలకు 400 మీటర్లు చొప్పున సొరంగం తవ్వితే 14 కోట్లు నిధులు అవసరమవుతాయని, 20 నెలల్లో ప్రాజెక్టు పూర్తికి అవకాశం ఉందని చెప్పారు. రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు.