News January 26, 2025

ఖమ్మం: బైక్‌ను ఢీకొన్న లారీ.. ఒకరు స్పాట్ డెడ్

image

ఎదులాపురం గ్రామపంచాయతీ వరంగల్ X రోడ్లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని వేగంగా వస్తున్న ఓ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న వ్యక్తిపై నుంచి లారీ టైర్లు వెళ్లడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 22, 2025

సీఎస్ఎల్ ఆఫీసులో పొంగులేటి ఆకస్మిక తనిఖీ

image

భూపరిపాలన వ్యవస్థను మరింత పారదర్శకంగా అందించడానికి రెవెన్యూ స్టాంప్‌లు, రిజిస్ట్రేషన్ సర్వే విభాగాలు ఒకే ఫ్లాట్ ఫామ్ మీదకు తెచ్చి భూ భారతి పోర్టల్‌కు అనుసంధానం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నాంపల్లి‌లోని సీఎస్ఎల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం వివిధ విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు.

News December 22, 2025

ఖమ్మంలో ఈనెల 24న జాబ్ మేళా

image

ఖమ్మం టీటీడీసీ భవనంలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ హ్యుందాయ్ కంపెనీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఏదైనా డిగ్రీ అర్హత గల 24-35 వయస్సు గల యువతీ, యువకులు అర్హులని చెప్పారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు విద్యార్హత పత్రాలతో ఉదయం 10 గంటలకు జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలని పేర్కొన్నారు.

News December 22, 2025

ఖమ్మంలో రెవెన్యూ సంఘం ఏకగ్రీవ ఎన్నిక

image

రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్నికలలో చోటుచేసుకున్న ఏకగ్రీవ ఫలితాలతో ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అభినందించారు. ఉద్యోగుల మధ్య ఉన్న బలమైన ఐక్యత, సమన్వయాన్ని ఈ ఫలితాలు చూపుతున్నాయని పేర్కొన్నారు. కలెక్టర్, నియామక, శిక్షణతో సంబంధిత చర్యలు తీసుకుంటామని, కొత్తగా చేరిన ఉద్యోగులకు అవగాహన, ప్రాయోగిక శిక్షణ అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, డివిజన్, సభ్యులు ఉన్నారు.