News July 23, 2024

ఖమ్మం: బొగత జలపాతంలో యువకుడి మృతి

image

వాజేడు మండలం బొగత జలపాతం వద్ద విషాదం జరిగింది. స్నేహితులతో కలిసి సరదాగా జలపాతం చూసేందుకు వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన యువకుడు జశ్వంత్(19) కొలనులో గల్లంతై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంకటాపురం పోలీసులు గజ ఈతగాళ్ళతో వెతికించి మృతదేహాన్నీ సాయంత్రం వెలికి తీశారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న జలపాతంలోకి ఎవరూ దిగొద్దని ఇప్పటికే అటవీశాఖ, పోలీసులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు.

Similar News

News October 14, 2025

ఆన్‌లైన్ మోసం.. రూ.30 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాడు అరెస్ట్

image

పార్ట్‌టైమ్ జాబ్, పెట్టుబడుల పేరుతో రూ.30 లక్షలు మోసం చేసిన సైబర్ నేరస్థుడిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వేంసూరుకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి టెలిగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని అశ చూపి రూ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేయించి మోసగించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఉన్న నిందితుడిని పట్టుకొని రిమాండ్ చేశారు.

News October 14, 2025

15న సదరం డేటా ఎంట్రీ ఆపరేటర్ నియామకానికి రాత పరీక్ష

image

రెండు సదరం డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు ఔట్ సోర్సింగ్ ద్వారా నియామకానికి ఈనెల 15న రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. నేడు సాయంత్రం 5 గంటలలోగా ఖమ్మం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ నియామకాలకు సంబంధించి పూర్తి సమాచారం కోసం సూపరింటెండెంట్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సంప్రదించాలన్నారు.

News October 14, 2025

‘పంట కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి’

image

జిల్లాలో వానాకాలం సాగు ధాన్యం, పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం ధాన్యం, పత్తి కొనుగోళ్లపై అదనపు కలెక్టర్లతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలని, ఎటువంటి సమస్యలు రాకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరగాలని పేర్కొన్నారు.