News February 13, 2026

ఖమ్మం: భక్తులకు గమనిక

image

మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని భక్తుల సౌకర్యార్థం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్లు ఖమ్మం ఆర్ఎం సరీరామ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని తీర్థాలకు, స్థానాల లక్ష్మీపురం, నీలాద్రి, అన్నపురెడ్డి పల్లి, మోతేగడ్డ, బెండలపాడు దేవాలయాలకు స్థానిక డిపోల-79 బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలన్నారు.

Similar News

News March 8, 2026

ప్రతి కరెంట్ స్తంభానికి ‘యూనిక్’ నెంబర్: ఖమ్మం ఎస్‌ఈ

image

ఖమ్మం జిల్లాలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి జీఐఎస్ మ్యాపింగ్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు ఎస్‌ఈ శ్రీనివాసాచారి తెలిపారు. 33 కేవీ లైన్లలో 55 ఫీడర్లు, 11 కేవీ లైన్లలో 545 ఫీడర్లకు యూనిక్ పోల్ నెంబర్లు కేటాయించారు. దీనివల్ల సమస్యలు వచ్చినప్పుడు పోల్ నెంబర్ ద్వారా లొకేషన్ గుర్తించి, యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయవచ్చని వివరించారు. ఈ టెక్నాలజీతో విద్యుత్ అంతరాయాలకు చెక్ పడనుంది.

News March 8, 2026

ఖమ్మం: ఈ మహిళా సర్పంచ్ గ్రేట్ కదా..!

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ నాయకన్ గూడెం సర్పంచ్ కంచరి సైదమ్మ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. భర్త ఆటో నడుపుతూ, టైర్ల షాపు నిర్వహిస్తుండగా.. ఆమె ఖాళీ సమయాల్లో ఆయనకు చేదోడుగా ఉంటూ పంచర్లు వేసేవారు. సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత కూడా ఆమె తన పనిని వదలకుండా, ఒకపక్క గ్రామ అభివృద్ధి పనులు చూస్తూనే.. మరోపక్క కష్టాన్ని నమ్ముకుని శ్రమిస్తున్నారు. ఆమె అంకితభావం మహిళలకు స్ఫూర్తినిస్తోంది.

News March 8, 2026

ఖమ్మం: సుపారీ గ్యాంగ్ సంచారం కలకలం..!

image

బోనకల్ మండలం గోవిందాపురం (ఎల్)లో సుపారీ గ్యాంగ్ సంచారం వార్తలు కలకలం రేపాయి. గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గ్రామస్థులు రెండు గంటల పాటు శ్రమించి పట్టుకున్నారు. నిందితుడు బిహార్‌కు చెందినవాడిగా గుర్తించగా, తమతో పాటు మరో ఐదుగురు వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తెలిపాడు. ఈ ఘటనతో భయాందోళనలో ఉన్న గ్రామస్థులు, వెంటనే పోలీసులు స్పందించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.