News February 15, 2025
ఖమ్మం మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి: కవిత

ఖమ్మం జిల్లాకు పేరుకే ముగ్గురు మంత్రులు, కానీ అభివృద్ధిలో శూన్యమని, వారు వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఖమ్మం బీఆర్ఎస్ ఆఫీస్‌లో ఆమె మాట్లాడుతూ.. బనకచర్ల పర్మిషన్ ఇస్తే ప్రజలు చాలా నష్టపోతారన్నారు. కళ్ల ముందు నీళ్లు వెళ్తున్నా.. ఉపయోగించుకోలేక పోతున్నామని చెప్పారు. మంత్రి తుమ్మల చాలా సీనియర్, ఆనాడు ప్రాజెక్టుల కోసం కేసీఆర్ ఎంత కష్టపడ్డారో ఆయనకు తెలుసని పేర్కొన్నారు.
Similar News
News March 6, 2026
HYDలో ఆకాశమే హద్దుగా హోర్డింగ్‌లు!

అడ్వర్టైజ్‌మెంట్ పాలసీలో మార్పులతో సిటీలో యాడ్ బోర్డుల గోల మొదలైంది. 6ఏళ్లుగా 15 ఫీట్ లిమిట్‌ను సర్కార్ సైలెంట్‌గా ఎత్తేసింది. GHMC, CMC, MMCల్లో ఇక ఆకాశమే హద్దుగా హోర్డింగ్‌లు వెలవనున్నాయి. పెద్ద కంపెనీలకు మేలు చేసేలా టెండర్ కండీషన్లు మార్చారని, చిన్న అడ్వర్టైజర్లు నష్టపోతారనే అరోపణలు ఉన్నాయి. 5ఏళ్ల కాంట్రాక్టుల పేరుతో రూ.కోట్లు ఆదాయానికి గండి కొట్టేలా తెర వెనుక పెద్ద స్కెచ్ నడిచిందని టాక్.
News March 6, 2026
HYD: ఇంజినీరింగ్ కాలేజీలో కొత్త ఫీజులు ఖరారు

నగరంలోని పలు ఇంజినీరింగ్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ ఫీజులు అమలుచేయనున్నారు. 3 సంవత్సరాలపాటు (2027- 28వరకు) ఈ నిబంధనలు అమలవుతాయి. ఇదిలా ఉండగా CBITకి అత్యధిక ఫీజు రూ.1.83 లక్షలు, ఆ తర్వాత వాసవికి రూ.1.75 లక్షలు, MGITకి రూ.1.67 లక్షలు, CVRకు రూ.1.63 లక్షలు, నారాయణమ్మకు రూ.1.62 లక్షలుగా నిర్ధారించారు.
News March 6, 2026
జాతీయ స్థాయి విలువిద్య పోటీల్లో రాణించిన పార్వతీపురం వాసులు

కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ లెవల్ ఆర్చరీ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన జిల్లా గిరిజన విలుకాళ్లను జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి శుక్రవారం ఆయన ఛాంబరులో అభినందించారు. ముగ్గురు గిరిజన విలుకాళ్లను నామినేట్ చేయగా, తమ అద్భుత ప్రదర్శనతో జిల్లాకు గుర్తింపు తీసుకువచ్చారని ప్రసంశించారు. జాతీయ స్థాయి వేదికపై మన జిల్లా గిరిజన క్రీడాకారులు రాణించడం గర్వకారణమని పేర్కొన్నారు.


