News February 24, 2025
ఖమ్మం: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.
Similar News
News February 24, 2025
స్టూడెంట్‌గా మారిన ఖమ్మం జిల్లా కలెక్టర్

పెనుబల్లి మండలం టేకులపల్లి మోడల్ పాఠశాలను ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థిగా మారి వారి పక్కన కూర్చొని టీచర్ చెప్పిన క్లాస్‌ను విన్నారు. అనంతరం ఆయన కూడా క్లాస్ చెప్పారు. పరీక్షల్లో మెరుగైన ఫలితాలకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. రాబోయే నెల రోజుల పాటు ఫోన్, టీవీలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం పాఠశాలలో వసతులను పరిశీలించారు.
News February 24, 2025
ఖమ్మం: పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్

రాబోయే పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్, మార్చి 21-ఏప్రిల్ 4 వరకు పదో పరీక్షలు జరుగనున్నాయి. జిల్లాలో 72 ఇంటర్, 97 పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాల భద్రత, ట్రాన్స్పోర్ట్, పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
News February 24, 2025
ఖమ్మం: శ్రీనివాసరావు పార్థివదేహానికి మంత్రి నివాళి

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యక్తిగత సహాయకుడు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు గుండెపోటుతో సోమవారం ఆకస్మికంగా మృతిచెందడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలోని ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి తుమ్మల వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.