News March 23, 2024
ఖమ్మం: మట్టికుండ.. చల్లగుండ
ఖమ్మం జిల్లాలో ఎండలు దంచుతున్నాయి. బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. వేసవిలో తాగునీటి కోసం మట్టి కుండలను కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. మట్టి కుండల్లో నిల్వ ఉంచిన నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సైతం సూచిస్తుండంతో పేద, ధనిక తేడా లేకుండా వీటిని కొంటున్నారు. సైజును బట్టి రూ.80 నుంచి రూ.300 వరకు ధరలు పలుకుతున్నాయి. పట్టణంలో పలు ప్రాంతాల్లో మట్టి కుండలను విక్రయిస్తున్నారు.
Similar News
News September 14, 2024
కొత్తగూడెం: రూ.మూడు లక్షలతో గణేషుడికి అలంకరణ
గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నపురెడ్డిపల్లిలోని గణేశ్ విగ్రహానికి భక్తుల నుంచి సేకరించిన మూడు లక్షల రూపాయలతో అలంకరణలు చేశారు. లక్ష్మీ గణపతి అవతారంలో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం లక్ష్మీ గణపతి విశిష్టతను పూజారి భక్తులకు తెలిపారు. ఉత్సవ కమిటీ పర్యవేక్షణలో పూజలు నిర్వహించారు.
News September 14, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు
>ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
>ఉమ్మడి జిల్లాలో ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరణ
>ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
>ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
>సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
>జిల్లా వ్యాప్తంగా పంట నష్టంపై సర్వే
>ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
>భద్రాచలంలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులు
>పాల్వంచలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
News September 14, 2024
ఖమ్మం: ‘పారిశుద్ధ్యం నిర్వహణపై దృష్టి పెట్టాలి’
ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.శ్రీజ శుక్రవారం పంచాయతీ విధులపై సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీలలో ఓటరు జాబితా అభ్యంతరాలు, నమోదు, కార్యదర్శుల బదిలీ, రిలీవింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. నిమజ్జనానికి ఏర్పాట్లు, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపుదలపై శ్రద్ధపెట్టాలని, వరద ప్రభావిత గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు ప్రాధాన్యం ఇచ్చి, సీసీ చార్జీల వంటి అంశాలను సమీక్షించాలన్నారు.