News February 27, 2025

ఖమ్మం: మద్యం అమ్మకాలు ఢమాల్!

image

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లిక్కర్ విక్రయాలు పడిపోతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో రూ. 75 కోట్ల అమ్మకాలు జరగగా, ప్రస్తుత ఫిబ్రవరిలో రూ.65 కోట్ల సేల్స్ జరిగాయి. ఏపీలో కొత్త మద్యం పాలసీ రావడంతో సత్తుపల్లి, మధిర, వైరా, ఖమ్మం, అశ్వారావుపేట ఎక్సై‌జ్ సర్కిళ్లలో ప్రభావం పడింది. పెరిగిన బీర్ల ధరలతో అమ్మకాలు మరింత క్షీణించవచ్చనే అభిప్రాయాలున్నాయి.

Similar News

News March 19, 2025

కల్లూరు: చెరువులో పడి వ్యక్తి మృతి

image

కల్లూరు మండలం లింగాల గ్రామంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి తాళ్ల శ్రీనివాసరావు (అడిషనల్ డైరెక్టర్ ఇన్ హ్యాండ్లూమ్స్) మృతి చెందారు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు గ్రామస్థులు, అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు ఇటీవలే గ్రామానికి వచ్చినట్లు అక్కడి ప్రజలు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 19, 2025

రూ.3,04,965 కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టిన Dy.CM

image

తెలంగాణ రాష్ట్ర 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.3,04,965 కోట్లబడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.12571 కోట్లు, రైతు భరోసాకు రూ.18 వేలకోట్లు, విద్యాశాఖ రూ.23108 కోట్లు కళ్యాణ లక్ష్మీ రూ.3683, వైద్యారోగ్యశాఖకు రూ.23108 కోట్లు, గృహజ్యోతి రూ.2080 కోట్లు, రైతు బీమా రూ.1539 కోట్లను కేటాయించినట్లు ఆయన తెలిపారు.

News March 19, 2025

బూర్గంపాడ్: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలంలో జరిగింది. భద్రాచలం క్రాస్ రోడ్డు సమీపంలోని రాంపురం వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రాంపురం గ్రామస్థుడిగా గుర్తించినట్లు సమాచారం.

error: Content is protected !!