News March 25, 2025
ఖమ్మం: మహిళల కోసం రేపు జాబ్ మేళా..

ఖమ్మంలోని నిరుద్యోగ మహిళలకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించుటకు ఈనెల 26న బుధవారం ఉదయం 10 గంటలకు తనికెళ్ల తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్.మాధవి తెలిపారు. దాదాపు 1,370 ఉద్యోగ ఖాళీల భర్తీకి గానూ 18-30 సంవత్సరాల వయస్సు గల డిగ్రీ పాసైన మహిళలు అర్హులని, వారికి వేతనం రూ.12వేల నుంచి రూ.18వేల వరకు ఉంటుందని అన్నారు
Similar News
News October 22, 2025
ఖమ్మం: తపాల శాఖ ఏజెంట్లకు.. దరఖాస్తుల ఆహ్వానం

తపాలా శాఖ బీమా పథకాలు పోస్టల్ జీవిత బీమా పీఎల్ గ్రామీణ తపాలా జీవిత బీమా(ఆర్పీఎస్ఐ) లకు సంబంధించి కమీషన్ పద్ధతిలో నియమించేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఖమ్మం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. 10వ తరగతి పూర్తి చేసిన వాళ్లు చేసి, 18 ఏళ్ల వయస్సు నిండిన నిరుద్యోగులు, గృహిణులు అంగన్వాడీ సేవకులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు అర్హులని, ఈనెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News October 22, 2025
ఖమ్మం: రెండు పదవులకు 66 మంది పోటీ

ఖమ్మం కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్ష పదవుల ఎంపికపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. డీసీసీకి 56, నగర కమిటీకి 10 మంది దరఖాస్తు చేసుకోగా, ఏఐసీసీ పరిశీలకుడు మహేంద్రన్ ఆరుగురి పేర్లను షార్ట్లిస్ట్ చేసినట్లు సమాచారం. ఐదేళ్లుగా కాంగ్రెస్కు విధేయులుగా ఉన్నవారికే పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యనేతల బంధువులు అర్హులు కాదన్న నిబంధనతో వడపోత పూర్తయి, నవంబర్ 15న తుది జాబితా వెలువడనుంది.
News October 22, 2025
ఖమ్మం DCC పీఠం కమ్మ సామాజిక వర్గానికేనా..?

ఖమ్మం DCC అధ్యక్ష పీఠం కోసం అంతర్గత రాజకీయం రగులుతుంది. Dy.CM భట్టి విక్రమార్క, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి వర్గాల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోంది. భట్టి వర్గం నుంచి వేమిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, నూతి సత్యనారాయణ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. భట్టి వ్యూహాత్మకంగా కమ్మ వర్గం అభ్యర్థి పేరును గోప్యంగా ఉంచినట్లు సమాచారం. స్థానికత, సామాజిక సమీకరణలపై ఆధారపడి అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది.