News March 27, 2025
ఖమ్మం: మహిళా మార్ట్ ప్రత్యేకంగా ఉండాలి: కలెక్టర్

సాధారణ మాల్స్‌లా కాకుండా మహిళా మార్ట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మంలోని సీక్వెల్ రోడ్డులో ఏర్పాటవుతున్న మహిళా మార్ట్ పనులను అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజతో కలిసి ఆయన పరిశీలించి సూచనలు చేశారు. ఈ మార్ట్‌లో స్వశక్తి మహిళా సంఘాల సభ్యులు తయారుచేసే వస్తువులను విక్రయించనుండగా.. వాటి తయారీ, మహిళా సంఘం సభ్యుల వివరాలతో డాక్యుమెంటరీ ప్రదర్శించాలని తెలిపారు.
Similar News
News December 8, 2025
ఖమ్మం: తొలి విడత పోరుకు 1,562 బ్యాలెట్ బాక్సులు

ఖమ్మం జిల్లాలో తొలి విడత జీపీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తొలి దశలో 7 మండలాల్లోని 192 సర్పంచ్ స్థానాలు,1,740 వార్డులకు ఎన్నిక జరగనుంది. ఇప్పటికే 20 మంది సర్పంచ్‌లు,158 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యారు. మిగిలిన 1,582 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 1,582 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. ఈనెల 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరిపి, 2 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు.
News December 8, 2025
ఖమ్మం: రెబల్స్‌కు షాక్..?

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన రెబల్స్‌కు పార్టీ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మూడు విడతలుగా జరిగిన నామినేషన్ ప్రక్రియలో పలువురు కాంగ్రెస్ నాయకులు రెబల్స్‌గా బరిలో దిగారు. దీంతో రెబల్స్‌గా పోటీ చేసే వారిని సస్పెండ్ చేసేందుకు జిల్లా, మండల కాంగ్రెస్ అధ్యక్షులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
News December 8, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} పెనుబల్లి నీలాద్రీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మంలో ఎమ్మెల్సీ తాత మధుసూదన్ పర్యటన
∆} నేలకొండపల్లిలో అభ్యర్థులకు అవగాహన కార్యక్రమం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆}ఖమ్మం ప్రజావాణి కార్యక్రమం రద్దు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన


