News April 3, 2025

ఖమ్మం మార్కెట్‌కు భారీగా మిర్చి

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం మిర్చి పోటెత్తింది. నాలుగు రోజుల సెలవుల అనంతరం మార్కెట్ ప్రారంభమవడంతో 70వేలకు పైగా మిర్చి బస్తాలతో మార్కెట్‌ నిండిపోయింది. మిర్చి ధర గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బాగా తగ్గడమే కాక.. కొద్దిరోజులుగా మరింత పతనమవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇరవై రోజుల వ్యవధిలోనే క్వింటాకు రూ.2వేల మేర ధర తగ్గింది.

Similar News

News April 12, 2025

మధిర డిపోను తనిఖీ చేసిన Dy.RM

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా TGSRTC డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య శనివారం మధిర డిపోను తనిఖీ చేశారు. డిపోలో ఉన్న బస్సుల మెయింటెనెన్స్ విభాగంలో మెకానిక్స్, ఆపరేషన్స్ విభాగంలో డ్రైవర్స్, కండక్టర్లతో మాట్లాడారు. తీవ్ర ఉష్ణోగ్రతలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మధిర డిపోలో పనిచేస్తున్న సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో DM శంకర్ రావు, ట్రాఫిక్&గ్యారేజ్ ఇన్‌ఛార్జిలు పాల్గొన్నారు.

News April 12, 2025

REWIND: వనజీవి రామయ్యకు యాక్సిడెంట్.. ఏం చేశారంటే..

image

రెండేళ్ల క్రితం తన ఇంటి ఎదుట బైక్‌పై రోడ్డు దాటుతుండగా రోడ్డు ప్రమాదం చేసిన వ్యక్తికి రామయ్య అరుదైన శిక్ష విధించారు. ప్రమాదం చేసిన వ్యక్తిపై కేసు నమోదుకు నిరాకరించడంతోపాటు బదులుగా 100 మొక్కలు నాటాలని అతనికి సూచించారు. రోడ్డు ప్రమాదం చేసిన వ్యక్తిని క్షమించి మొక్కలు నాటమని కోరడంతో పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని బట్టి చూస్తే రామయ్యకు పర్యావరణం అంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు. 

News April 12, 2025

వనజీవి రామయ్య కుటుంబ ప్రస్థానమిదే..

image

ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన వనజీవి రామయ్య తన 15వ ఏట కొణిజర్ల(M) తుమ్మలపల్లికి చెందిన జనమ్మను వివాహమాడారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మొదటి కుమారుడు సైదులు ఏడాది క్రితం గుండెపోటుతో మరణించగా, 2వ కుమారుడు సత్యనారాయణ అనారోగ్యంతో మరణించారు. చిన్న కుమారుడు కనకయ్య రెడ్డిపల్లిలోనే దుకాణం నిర్వహిస్తున్నారు. 

error: Content is protected !!