News June 20, 2024
ఖమ్మం మార్కెట్లో స్వల్పంగా పెరిగిన పత్తి ధర

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7050 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యాపారస్తులు తెలిపారు. మిర్చి ధరలు నిన్న, ఈ రోజు స్థిరంగా కొనసాగుతుండగా, అటు పత్తి ధర మాత్రం 75 రూపాయలు పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు.
Similar News
News February 17, 2026
ఖమ్మం జిల్లా అటవీశాఖ అధికారిగా కృష్ణప్రసాద్

ఖమ్మం అటవీశాఖ డివిజన్ అధికారిగా సిహెచ్ కృష్ణప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లాలో అటవీ అభివృద్ధి, సంరక్షణకు ప్రాధాన్యతనిస్తామని, హరితహారం, సామాజిక అటవీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీఎఫ్‌ఓకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
News February 17, 2026
ప్రతి విద్యార్థి చదువుపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

ఖమ్మం జిల్లాలోని ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను అభ్యసించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అ కలెక్టర్ శ్రీజ సూచించారు. మంగళవారం 7మండలాల ఎంఈఓలు, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ‘ఎవ్రీ చైల్డ్ రైట్స్’, ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేలా బోధనా ఉండాలన్నారు.
News February 17, 2026
సన్న వడ్ల బోనస్ జమ: కలెక్టర్ అనుదీప్

ఖమ్మం జిల్లాలో 2025-26 ఖరీఫ్ సీజన్‌లో సన్న రకం వడ్లు పండించిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ జమ చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 64,093 మంది రైతులకు మొత్తం రూ.175.69 కోట్లు బోనస్‌గా అందజేశామని వెల్లడించారు. మద్దతు ధరతో పాటు ఈ అదనపు బోనస్ చెల్లింపు రైతులకు ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు.


