News February 21, 2025
ఖమ్మం మార్కెట్కు పోటెత్తిన మిర్చి

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు గురువారం మిర్చి పోటెత్తింది. దాదాపు 90 వేల బస్తాల మిర్చి మార్కెట్కు వచ్చింది. క్వింటాకు రూ.14,050 ధర పలికింది. ధర తగ్గుముఖం పట్టడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. హమాలీలు దిగుమతి పేరుతో బస్తాకు రూ. 5 నుంచి రూ. 7, కాంటా వేసినందుకు బస్తకు మరో రూ. 3 , కమీషన్ దార్లు కటింగ్ పేరుతో ఇంకో రూ. 3 నుంచి రూ. 5 వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News December 7, 2025
ఆదిలాబాద్: ‘అప్పులైనా సరే.. గెలుపే ముఖ్యం’

ADB జిల్లా వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల సందడి ఏర్పడింది. రోజు తెల్లవారుజామున నుంచి రాత్రి వరకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు, ప్రజల మధ్య పరస్పర భేటీ జరుగుతోంది. అప్పులకు పాలవ్వకుండా సర్పంచ్ పదవికి దూరంగా ఉండాలని పలువురు చెపుతున్నప్పటికీ..ఎంత అప్పులైనా సరే, తమకు గెలుపే ముఖ్యం అంటూ ఓ వైపు అభ్యర్థులు అంటున్నారు. ఈ నెల 11న తోలి విడత పోలింగ్ ఉండడంతో కనీసం విశ్రాంతి తీసుకోకుండా ప్రచారాలు చేస్తున్నారు.
News December 7, 2025
కోనసీమలో ప్రశాంతంగా ఎన్ఎంఎంఎస్ పరీక్షలు

NMMS ఎంపిక కోసం నిర్వహించిన పరీక్షలు జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 14 కేంద్రాల్లో మొత్తం 3,106 మంది విద్యార్థులకు గానూ 3,038 మంది హాజరైనట్లు డీఐఈఓ సూర్య ప్రకాశరావు తెలిపారు. 68 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదన్నారు. అమలాపురంలో 5 కేంద్రాలను కేటాయించగా, కొత్తపేటలోని పరీక్షా కేంద్రాలను స్వయంగా తనిఖీ చేసి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
News December 7, 2025
పాడేరులో ప్రమాదం.. విద్యార్థి మృతి

పాడేరు మండలం గబ్బంగి మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పదో తరగతి విద్యార్థి శ్రీరామబద్రి (15) మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. ఆదివారం వంజంగి వెళ్లేందుకు బైక్పై లిఫ్ట్ అడిగి ఎక్కిన శ్రీరామ్, గబ్బంగి మలుపు వద్ద బైక్ వేగంగా వచ్చి సిగ్నల్ పోల్ను ఢీకొనడంతో ఎగిరిపడి మృతి చెందాడు. మృతుడు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. బైక్ నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.


