News December 10, 2024
ఖమ్మం: మాస్ కాపీయింగ్.. 22 మంది విద్యార్థులు డిబార్
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సోమవారం జరిగిన డిగ్రీ పరీక్షలలో మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ 22 మంది విద్యార్థులు పట్టుబడినట్లు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి కట్ల రాజేందర్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 12 మంది, ఆదిలాబాద్లో ఐదుగురు, ఖమ్మంలో ఐదుగురు విద్యార్థులు చిట్టీలు రాస్తూ పట్టుబడగా వారిని డిబార్ చేసినట్లు చెప్పారు.
Similar News
News December 27, 2024
మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరనిలోటు: ఎంపీ రామసహాయం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా ఖమ్మం సంజీవరెడ్డి భవనంలో శుక్రవారం ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, PSR యూత్ అధ్యక్షుడు దుంపల రవికుమార్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఆయన మృతి దేశానికి తీరని లోటని ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
News December 27, 2024
ఇల్లందు – కారేపల్లి రహదారిపై రోడ్డుప్రమాదం
సింగరేణి మండల పరిధిలోని ఇల్లందు – కారేపల్లి ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన వ్యక్తిని ఉసిరికాయలపల్లికి చెందిన మల్లయ్యగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారిలో వెంకటేశ్వర్లు పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తీసుకెళ్లారు.
News December 27, 2024
మన్మోహన్ సింగ్ మృతి పట్ల పొంగులేటి సంతాపం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి, అభిమానులకు పొంగులేటి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేసుకున్నారు. కేంద్రమంత్రిగా, ప్రధానిగా దేశానికి నిర్విరామంగా సేవలందించారని కొనియాడారు.