News February 25, 2025
ఖమ్మం: మిరప ధర పతనం.. రైతుల దిగాలు!

ఉమ్మడి జిల్లాలో మిర్చికి మద్దతు ధర లభించక రైతుల కంట కన్నీరు ఉబికివస్తోంది. గతేడాది రూ.20వేలు ఉన్న ధర ఈయేడు రూ.14వేలకు పడిపోయింది. ఈసారి తెగుళ్లకు తోడు కూలీల ధరలతో రైతులు దిగాలు చెందుతున్నారు. ధరలు పడిపోతుండటంతో పోయిన యేడు 1.50 లక్షలకు ఉన్న మిర్చి సాగు ఈసారి 95 వేలకు తగ్గింది. జిల్లాలో మిర్చి బోర్డు ఏర్పాటు చేసి రూ.25వేల మద్దతు చెల్లించాలని జిల్లా రైతాంగం కోరుతోంది.
Similar News
News November 15, 2025
ఖమ్మం: పరిశుభ్రతతో మెరుగైన ఆరోగ్యం: మంత్రి తుమ్మల

ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్లో చేప పిల్లలను విడుదల చేసిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశుభ్రతతో ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. నగర పారిశుద్ధ్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పని చేయాలన్నారు. ప్లాస్టిక్, చెత్త కారణంగా దోమల వ్యాప్తి పెరిగి రోగాలు వస్తున్నాయని జాగ్రత్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్ సహా అధికారులు పాల్గొన్నారు.
News November 15, 2025
ఖమ్మం: అవగాహన ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం నగరం వైరారోడ్ లోని ఎస్.ఆర్ గార్డెన్స్ నుండి కలెక్టరేట్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జెండా ఊపి ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు. అవగాహనతో డయాబెటిస్‌ను తగ్గించుకోవచ్చని చెప్పారు. మధుమేహంపై నిర్లక్ష్యం వహిస్తే ఇది శరీరంలోని అన్ని అవయవాలను దెబ్బ తీస్తుందన్నారు.
News November 15, 2025
KMM: జీవనశైలి మార్పులతో మధుమేహం నియంత్రణ: కలెక్టర్

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మధుమేహం ‘సైలెంట్ కిల్లర్’ అని పేర్కొంటూ, రోజూ అరగంట నడక, వైట్ రైస్ తగ్గించడం, చిరుధాన్యాలు తీసుకోవడం ద్వారా నియంత్రణ సాధ్యమన్నారు. పిల్లల్లో షుగర్ పెరుగుతున్నందున ఫోన్ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో 55,829 మంది షుగర్ రోగులకు మందులు అందిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.


