News February 25, 2025
ఖమ్మం: మిరప ధర పతనం.. రైతుల దిగాలు!

ఉమ్మడి జిల్లాలో మిర్చికి మద్దతు ధర లభించక రైతుల కంట కన్నీరు ఉబికివస్తోంది. గతేడాది రూ.20వేలు ఉన్న ధర ఈయేడు రూ.14వేలకు పడిపోయింది. ఈసారి తెగుళ్లకు తోడు కూలీల ధరలతో రైతులు దిగాలు చెందుతున్నారు. ధరలు పడిపోతుండటంతో పోయిన యేడు 1.50 లక్షలకు ఉన్న మిర్చి సాగు ఈసారి 95 వేలకు తగ్గింది. జిల్లాలో మిర్చి బోర్డు ఏర్పాటు చేసి రూ.25వేల మద్దతు చెల్లించాలని జిల్లా రైతాంగం కోరుతోంది.
Similar News
News October 19, 2025
ఆరోగ్యం కోసం ‘ధన్వంతరీ మంత్రం’

నమామి ధన్వంతరిమ్ ఆది దేవం
సురాసురైహి వందిత పాదపద్మం
లొకే జరా రుక్ భయ మృత్యు నాశకం
దాతారం ఈశం సకల ఔషధీనాం
ఈ మంత్రం ధన్వంతరి స్వామివారిని కీర్తిస్తుంది. ఆయన జయంతి రోజున ఈ మంత్రాన్ని చదవడం వల్ల సకల వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఈ పవిత్ర దినాన మందులు దానం చేయడం, నిస్సహాయులకు ఔషధాలను అందించడం వల్ల దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుందని చెబుతారు.
News October 19, 2025
స్పోర్ట్స్ రౌండప్

* ప్రో కబడ్డీ సీజన్-12లో ప్లేఆఫ్స్ చేరిన తెలుగు టైటాన్స్.. 18 పాయింట్లతో ప్లేఆఫ్స్కు క్వాలిఫై
* ఇవాళ WWCలో ఇంగ్లండ్తో తలపడనున్న భారత జట్టు.. సెమీస్ రేసులో కొనసాగాలంటే టీమ్ ఇండియాకు ఈ విజయం కీలకం.. ఇప్పటికే సెమీస్ చేరిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా
* వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్లో ఫైనల్ చేరిన భారత షట్లర్ తన్వీ శర్మ.. నేడు థాయ్లాండ్ ప్లేయర్ అన్యాపత్తో అమీతుమీ
News October 19, 2025
ధన్వంతరీ ఎవరు?

క్షీరసాగర మథనంలో జన్మించిన వారిలో ధన్వంతరి ఒకరు. ఆయన మహా విష్ణువు అంశ. ఆశ్వయుజ బహుళ త్రయోదశి నాడు ఆయన జన్మించారు. అందుకే ఆ రోజును ధన్వంతరి జయంతిగా జరుపుకొంటాం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం.. ధన్వంతరి, సూర్యభగవానుడి వద్ద ఆయుర్వేద జ్ఞానాన్ని పొందిన 16 మంది శిష్యులలో ఒకరు. ఆయుర్వేదానికి, ఆరోగ్యానికి దైవంగా పూజించే ఆయనను స్మరించడం, ఆరాధించడం సకల రోగాల విముక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది.