News February 25, 2025

ఖమ్మం: మిరప ధర పతనం.. రైతుల దిగాలు!

image

ఉమ్మడి జిల్లాలో మిర్చికి మద్దతు ధర లభించక రైతుల కంట కన్నీరు ఉబికివస్తోంది. గతేడాది రూ.20వేలు ఉన్న ధర ఈయేడు రూ.14వేలకు పడిపోయింది. ఈసారి తెగుళ్లకు తోడు కూలీల ధరలతో రైతులు దిగాలు చెందుతున్నారు. ధరలు పడిపోతుండటంతో పోయిన యేడు 1.50 లక్షలకు ఉన్న మిర్చి సాగు ఈసారి 95 వేలకు తగ్గింది. జిల్లాలో మిర్చి బోర్డు ఏర్పాటు చేసి రూ.25వేల మద్దతు చెల్లించాలని జిల్లా రైతాంగం కోరుతోంది.

Similar News

News March 24, 2025

ఆదోని సబ్ కలెక్టరేట్‌లో ప్రజా గ్రీవెన్స్

image

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ప్రజా సమస్యలు తెలుసుకొని వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ శ్రీనివాసరాజు, వేణు సూర్య, డీఎల్పీఓ నూర్జహాన్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సత్యవతి, ఇరిగేషన్ డీఈ షఫీ ఉల్లా, ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ పద్మజ పాల్గొన్నారు.

News March 24, 2025

సాలూరు: పార్లమెంట్‌లో “అరకు కాఫీ స్టాల్’

image

పార్లమెంట్‌లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా అరకు కాఫీ స్టాల్‌ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్‌కు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జుయల్ ఓరం, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

News March 24, 2025

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం

image

TG: బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 19 మంది బెట్టింగ్ యాప్ ఓనర్లపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో ఇటీవల కేసులు నమోదైన సెలబ్రిటీలను సాక్షులుగా మార్చాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో 25 మంది సెలబ్రిటీలపై మియాపూర్ పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!