News April 6, 2024
ఖమ్మం: ముగిసిన ఇంటర్ వాల్యుయేషన్
ఖమ్మం: ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనం శుక్రవారంతో ముగిసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 2,75,139 జవాబు పత్రాలను జిల్లాకు పంపించగా నెల 4వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభించారు. ప్రతీ అధ్యాపకుడు రోజుకు 30 చొప్పున జవాబు పత్రాలను దిద్దగా , శుక్రవారంతో వాల్యూయేషన్ పూర్తయిందని డీఐఈఓ కె.రవిబాబు తెలిపారు.
Similar News
News January 4, 2025
ఎయిర్‌పోర్టు నిర్మాణంలో అపోహలొద్దు: పొంగులేటి
కొత్తగూడెంలో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి రుద్రంపూర్ ప్రాంతంలో సింగరేణి, అటవీ భూముల్లో సర్వే జరుగుతుందని, అపోహలు నమ్మొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పర్యటనలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం అమలు చేసిన మా ప్రాంతాలకు రావాలని పట్టుబట్టి సాధించేవరకు నిద్రపోని వ్యక్తి కూనంనేని అని చెప్పారు. కొత్తగూడెం అభివృద్ధికి ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రి అన్నారు.
News January 3, 2025
కోడి పందేలు నిర్వహిస్తే ఉపేక్షించం: సీపీ
కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో కోడి పందేలను నిషేధించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఈరోజు పోలీస్ అధికారులతో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదని సీపీ అధికారులకు స్పష్టం చేశారు.
News January 3, 2025
నరసింహావతారంలో శ్రీరామచంద్రుడు
దక్షిణాది అయోధ్యలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా రోజుకో రూపంలో శ్రీరామచంద్రుడు దర్శనమిస్తున్నారు. శుక్రవారం రాములోరు నరసింహావతారంలో భక్తులను కనువిందు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. అధ్యాయనోత్సవాలలో భాగంగా పర్ణశాల రామయ్య శనివారం వామనావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని అర్చకులు తెలిపారు.