News October 25, 2024
‘ఖమ్మం మున్నేరుపై మరో రెండు వంతెనలు నిర్మించాలి’

ఖమ్మంలో 2 వంతెనల పైనుంచి వాహనాలు వెళ్తుండటంతో ట్రాఫిక్ జామ్ సమస్యలతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో భారీవాహనాలు వెళ్లేందుకు కరుణగిరి వంతెన, చిన్న వాహనాలకు నిజాం కాలం నాటి వంతెన ఉంది. మరో ప్రకాష్ నగర్ వంతెన మరమ్మతులకు గురైంది. దీంతో పెరిగిన ట్రాఫిక్ దృష్ట్యా జిల్లా మంత్రులు చొరవ తీసుకుని మున్నేరుపై మరో 2 వంతెనలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్..!
Similar News
News February 28, 2026
ఖమ్మం: పేరుకు మాత్రమే పేదల పార్టీ: ఈటల

కనికరం లేకుండా పేదల ఆవాసాలను కూల్చివేసి తప్పు జరిగినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా బాధితులకు క్షమాపణ చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పేదలు ఓట్లు వేస్తే గద్దెనెక్కిన ఈ పార్టీ పేరుకు మాత్రమే పేదల పార్టీ అని చేతల్లో మాత్రం రాక్షస పార్టీ అని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని, కూల్చిన చోటే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. లేకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు.
News February 28, 2026
రేపు ఖమ్మంకు నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడి రాక

నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆదివారం ఖమ్మంలో పర్యటించనున్నట్లు జిల్లా బీజేపీ నాయకుడు జాటోత్ మధునాయక్ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సా.3 గంటలకు ఎస్టీ కమిషన్ సభ్యుడు వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులను పరామర్శిస్తారని చెప్పారు. అనంతరం భూదాన్ భూముల్లో కూల్చివేసిన ఇళ్లను పరిశీలిస్తారని అన్నారు. ఈ విషయాన్ని అధికారులు, ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.
News February 28, 2026
ఖమ్మం: ముఖ్యమంత్రి గారూ మీ హృదయం ఎందుకు కరగదు?

ఖమ్మం భూదాన్ ఘటనలో ఓ ఎస్‌ఐ కూడా బాధితుల పరిస్థితి చూసి కంటతడి పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని MLC తీన్మార్ మల్లన్న గుర్తు చేశారు. పోలీసులే కరిగిపోయారు, మరి ముఖ్యమంత్రి గారూ మీ హృదయం ఎందుకు కరగదు? అని ప్రశ్నించారు. బీసీలపై వివక్ష కొనసాగితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ‘రేపు అసెంబ్లీలో ఇదే అంశంపై గళమెత్తుతాను. ఎవరు అడ్డుకుంటారో చూస్తాను’ అంటూ సవాల్ విసిరారు.


