News January 29, 2025

ఖమ్మం: మున్సిపల్ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా!

image

KMM జిల్లాలోని మున్సిపాలిటీలకు ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేదని ప్రభుత్వ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం పూర్తైన విషయం తెలిసిందే. పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ఆ మరుసటి రోజు నుంచి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. మరో 6నెలలు లేదా ఏడాది పాటు ప్రత్యేక పాలన కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Similar News

News February 17, 2025

KMM: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

image

వరంగల్ -ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

News February 17, 2025

పెట్రోల్ పోసి నిప్పంటించిన అత్త, మామ.. అల్లుడి మృతి

image

అల్లుడిపై అత్తింటి వారు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన టేకులపల్లిలో జరిగింది. SI శ్రీకాంత్ వివరాల ప్రకారం.. పాల్వంచ దంతెలబోర్‌కి చెందిన గౌతమ్ రామచంద్రునిపేటకు చెందిన కావ్యను ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత నెల కావ్య పిల్లలతో పుట్టింటికి వచ్చింది. ఈ నెల 2న గౌతమ్ భార్య, పిల్లలను చూసేందుకు పేటకు వచ్చాడు. అత్తింటి వారు గౌతమ్‌‌పై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పుపెట్టగా
MGMలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News February 17, 2025

KMM: 19 మందిలో ఒక్కరే మహిళా అభ్యర్థి

image

వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన 19 మంది అభ్యర్థులలో కేవలం ఒక్కరే మహిళా అభ్యర్థి ఉన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన అర్వ స్వాతి బరిలో నిలిచిన అతి చిన్న వయస్కురాలిగా (34 ఏళ్లు) ఉన్నారు. 68 ఏళ్ల వయసుతో హనుమకొండ జిల్లా దామరకు చెందిన దామర బాబురావు పెద్ద వయస్కుడిగా బరిలో ఉన్నారు. ఫిబ్రవరి 27 తేదీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది.

error: Content is protected !!