News November 15, 2024
ఖమ్మం: మూడు రోజులు సెలవులు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇవాళ కార్తీక పౌర్ణమి/ గురునానక్ జయంతి, 16న శనివారం వారాంతపు సెలవు, 17న ఆదివారం సాధారణ సెలవు అని ప్రకటించారు. తిరిగి సోమవారం రోజున పునః ప్రారంభమవుతుందని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Similar News
News March 10, 2026
ఖమ్మం: ‘ప్రజాపాలన’ పనులపై సీఎస్ సమీక్ష

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం HYD నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ సమీక్షలో పాల్గొన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని, ప్రజా సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను సీఎస్ ఈ సందర్భంగా అధికారులకు వివరించారు.
News March 10, 2026
నక్షా లేని గ్రామాల్లో రీ-సర్వే.. సొంత భవనాల్లోకి కార్యాలయాలు

రాష్ట్రంలో భూ లావాదేవీల్లో పారదర్శకత పెంచేందుకు అత్యాధునిక ‘రోవర్’ పరికరాలతో రీ-సర్వే నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, Dy.CM భట్టి విక్రమార్క వెల్లడించారు. మంగళవారం HYDలో వారు మాట్లాడుతూ.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను సమన్వయం చేస్తూ కొత్త పోర్టల్ తీసుకువస్తామన్నారు. అలాగే సొంత భవనాలు లేని ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మిస్తామని ప్రకటించారు.
News March 10, 2026
ఖమ్మంలో మార్చి 12న ప్రజాప్రతినిధులకు శిక్షణ

ఖమ్మంలో భక్తరామదాసు కళాక్షేత్రంలో గురువారం సర్పంచ్‌లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్‌లు, వార్డు కౌన్సిలర్లకు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మంగళవారం సీఎస్ కె.రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలుపై అవగాహన కల్పించారు.


